ETV Bharat / state

Telangana Assembly Election Arrangements 2023 : నేడు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం.. పోలింగ్ ఏర్పాట్లపై ఆరా

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 8:58 AM IST

Updated : Nov 1, 2023, 9:58 AM IST

Telangana Assembly Election Arrangements 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉన్నతాధికారులకు పలు ఆదేశాల జారీ చేసింది. అందుకనుగుణంగా అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పౌరులకు ఈసీ భరోసా కల్పిస్తూ.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు పోలింగ్ ఏర్పాట్లు పరిశీలించేందుకు నేడు కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి రానుంది.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023

Telangana Assembly Election Arrangements 2023 ఎన్నికల నిర్వహణకు విస్తృతంగా సాగుతున్న ఏర్పాట్లు

Telangana Assembly Election Arrangements 2023 : ఎన్నికల వేళ ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థులు, నాయకులకు భద్రతను పెంచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు.. అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నేరచరితులను గుర్తిస్తున్నారు.

Arrangements Of Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలు వేళ పోలీసుల విస్తృత తనిఖీల్లో సీజ్‌ చేసిన మొత్తం రూ.400 కోట్ల రూపాయల మార్క్‌ దాటింది. అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల స్వాధీనాల మొత్తం రూ.412.46 కోట్లకు పైగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పర్యవేక్షణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం 60 మంది అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించింది.

107 Candidates Disqualified From Elections : 107 మంది అభ్యర్థులపై ఈసీ అనర్హత వేటు.. ఆ నియోజకవర్గంలోనే అధికంగా

Telangana Assembly Election Nominations 2023 : శుక్రవారం నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. అభ్యర్థుల వ్యయాన్ని నామినేషన్ దాఖలు సమయం నుంచి లెక్కిస్తారు. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు దృష్ట్యా రాష్ట్రానికి చెందిన యూనిఫాం సర్వీసుల సిబ్బందిని 65,000 మందిని వినియోగించనున్నారు. కేంద్ర సాయుధ బలగాలు కూడా ఎన్నికల విధుల్లో ఉన్నాయి. ఇప్పటికే వంద కంపెనీల బలగాలు రాష్ట్రానికి వచ్చాయి.

Central Election Commission Telangana Tour Today : 2018 ఎన్నికల సమయంలో రాష్ట్రానికి 300 కంపెనీల కేంద్ర బలగాలను పంపారు. ఇప్పుడు కూడా పరిస్థితులను బేరీజు వేసుకుంటూ కేంద్ర బలగాలను ఈసీ తెలంగాణకు పంపుతోంది. ఎల్లుండి శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను సమీక్షించనుంది. ఇందులో భాగంగా సీఈసీ బృందం ఇవాళ హైదరాబాద్‌లో అధికారులతో సమావేశం కానున్నారు. ఓటర్ జాబితా, స్లిప్పుల పంపిణీ, ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాల ముద్రణా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై ఆరా తీయనున్నారు.

EC Transfers Several Collectors and SPs In Telangana : 20 మంది అధికారులపై ఈసీ వేటు.. ఎన్నికల విధుల నుంచి వారంతా ఔట్

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో కూడా సమావేశమై ప్రలోభాల కట్టడి, తనిఖీలు, స్వాధీనం చేసుకుంటున్న మొత్తం, చెక్‌పోస్టులు, సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నారు. సరిహద్దు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, అధికారులతో సమావేశమై పరస్పర సమన్వయం, సరిహద్దుల వద్ద చెక్‌పోస్టుల తనిఖీలు, తదితర అంశాలపై చర్చిస్తారు. ములుగు జిల్లా వెంకటాపురం పరిధిలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున ఓటు వేయడానికి ఎవరూ భయపడవద్దని.. అందరికీ పోలీసు బలగాలు తోడుగా ఉంటాయని అధికారులు భరోసా కల్పించారు.

Telangana Assembly Elections 2023 : ప్రగతిభవన్ నుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నారన్న విషయంలో మంత్రి కేటీఆర్‌పై (KTR) .. రెండు మూడు ఫిర్యాదులు అందాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈసీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు, అతిథి గృహాలు వంటి వాటిలో ఉంటూ ప్రచారాలు చేయకూడదని పేర్కొన్నారు. ఈ నెల 3 నుంచి 10 వరకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 15 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. కేవలం ఐదు మంది మాత్రమే నామినేషన్ కేంద్రాల వద్దకు రావాల్సి ఉంటుంది.

Excise Department Searches in Telangana : ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ అలర్ట్.. మద్యం, డ్రగ్స్ సరఫరాపై పటిష్ఠ నిఘా

Telangana Assembly Elections 2023 : ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సీఈసీ కసరత్తు.. ఆకర్షణీయంగా పోలింగ్​ కేంద్రాల ముస్తాబు

Last Updated : Nov 1, 2023, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.