Special Trains for Sankranthi : సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అధికంగా రద్దీ ఉండే రోజుల్లో ప్రత్యేక రైళ్లు బయలుదేరేలా ఏర్పాట్లు చేశారు. జనవరి 7 నుంచి 18 వరకు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడవనున్నాయి.
హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. రైళ్ల పూర్తి వివరాలు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రేపు ఉదయం 8గంటల నుంచి ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: