Sankranti Pindi Vantalu in Hyderabad : సంబురాల సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగభాగ్యాలు, పిల్లాపాపలతో కళకళలాడుతాయి. గతంలో ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు పిండి వంటలు తయారు చేసి వడ్డించేవారు. చిన్నాపెద్దా అందరూ ఆయా వంటకాల తయారీలో పాలుపంచుకునేవారు. ఇప్పుడు మాత్రం ఉద్యోగాలు, వివిధ పనుల రీత్యా పిండి వంటలు చేసే తీరికా, ఓపిక ఉండట్లేదు. మార్కెట్‌లో లభించే వాటిపై మొగ్గుచూపుతుండటంతో పండగ వేళ మంచి డిమాండ్ ఏర్పడింది.
Sankranti Special Four Recipes in Telangana : ఈ ఏడాది పిండి వంటలకు గతంలో కంటే డిమాండ్ పెరిగిందని దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఉద్యోగ రీత్యా నగరంలో ఉండేవాళ్లు, సొంతూళ్లకు వెళ్లలేని వారు ఎక్కువగా కొంటున్నారని వెల్లడిస్తున్నారు. గారెలు, ఉండ్రాళ్లు, అప్పాలు, అరిసెలు ఎక్కువగా కొంటున్నట్లు వివరిస్తున్నారు. దీంతో పది మందికి ఉపాధి లభించడంతో పాటు మంచి ఆదాయం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి పిండి వంటలు చేస్తున్నారా? ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి!
'ఇప్పుడున్న బీజీ లైఫ్‌లో సమయం సరిగ్గా ఉండడం లేదు. ఉరుకులు, పరుగులతోనే రోజులు గడిచిపోతున్నాయి. అందుకే సంక్రాంతికి పిండి వంటకాలను దుకాణాలలో కొనుగోలు చస్తున్నాం. నేనైతే ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వీట్స్‌లో పిండి వంటకాలను కొనుగోలు చేస్తాను. అరిసెలు, సకినాలు, నువ్వుల లడ్డులు, మురుకులు ఇలా రకరకాల పిండి వంటలను తీసుకెళ్తాను. ఇక్కడ బాగా రుచికరంగా చేస్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్తే ఐటెమ్స్ ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటాయి. మా పిల్లలు కూడా ఎంతో బాగుంటాయని చెబుతూ ఉంటారు.' -కొనుగోలుదారుడు
Special Story on Sankranti Pindi Vantalu : సెలవులన్నీ పిల్లలతోనే గడిచిపోతుండటంతో పిండి వంటలు చేసే సమయం ఉండట్లేదని వినియోగదారులు చెబుతున్నారు. దీనికి తోడు మార్కెట్లో సైతం ఇంట్లో చేసిన విధంగా రుచిగా ఉంటున్నాయని అంటున్నారు. సమయాభావంతో పాటు సహాయం చేసేవారు లేకపోవడంతో పిండి వంటలు చేయడం తగ్గినట్లు తెలుస్తోంది.
'గత ఏడాదికంటే ఈ సంవత్సరం మాకు పండుగ ముందే ప్రారంభమైంది. ఇంతకముందు భోగి పండుగ నుంచి సీజన్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఒక వారం ముందే సంక్రాంతి పండుగ ప్రారంభం అయింది. వారం నుంచి బిజినెస్ బాగా సాగుతుంది. అర్డర్స్ వస్తున్నాయి, అలాగే కష్టమర్లు కూడా ఎక్కువగానే వస్తున్నారు. సంక్రాంతి అంటే ముఖ్యంగా మురుకులు, నువ్వుల లడ్డు, అరిసెలు, సకినాలు ఈ నాలుగు ఐటెమ్స్. ఇవి ఈ సంక్రాంతికి బాగా అమ్ముడుపోతాయి. ఎక్కువ మంది వీటినే కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది మాకు సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా ఉంది.' -దుకాణం యజమాని
సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ - వాహ్వా అనిపిస్తున్న 'ఘేవర్' మిఠాయి గురించి తెలుసా?
శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు - సొంతూరుకు వెళ్లిన అనుభూతి కలిగిందన్న సందర్శకులు