ETV Bharat / state

24 గంటల కరెంట్‌ ముసుగులో వేల కోట్ల దోపిడీ చేశారు : రేవంత్‌ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 9:01 PM IST

Revanth Reddy Adilabad Tour Today : అవినీతిపరులను వదలబోమంటున్న మోదీ.. కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టు, కూలిపోతున్న అన్నారం ప్రాజెక్టులు ఎందుకు కనిపించలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీకి కేసీఆర్‌ స్నేహితుడు కాకుంటే.. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాలో పర్యటించిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇచ్చిన హామీలను పదేళ్లలో నెరవేర్చలేని కేసీఆర్‌కు ఓటెందుకేయాలని ప్రశ్నించారు.

Congress Election Campaign 2023
Revanth Reddy Vijayabheri Sabha in Adilabad

Revanth Reddy Speech at Khanapur 24 గంటల కరెంట్‌ ముసుగులో వేల కోట్ల దోపిడీ చేశారు

Revanth Reddy Adilabad Tour Today : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం(Congress Campaign Telangana)లో వేగంగా ముందుకు సాగుతోంది. విజయభేరీ సభ పేరుతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలు, మోదీ, కేసీఆర్‌ బంధంపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. కాంగ్రెస్‌(Congress) ప్రకటించిన ఆరు గ్యారంటీలను వివరిస్తూ తమకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరుతున్నారు.

Revanth Reddy Speech at Khanapur : రెండో రోజు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఖానాపూర్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఖానాపూర్‌లో విజయభేరీ సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్‌ను గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్, బీజేపీలు డబ్బులున్న వారికే టికెట్లిచ్చాయని.. బొజ్జులాంటి పేదలకు సైతం తమ పార్టీ ఎన్నికల్లో నిలబెట్టిందని చెప్పారు. 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను పోటీ చేయనని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని రద్దు చేసి తీరుతామన్నారు.

'మోదీ మేడిగడ్డను ఎందుకు పరిశీలించలే - బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటే'

"మేడిగడ్డ బ్యారేజీ మేడిపండులాగా పగిలిపోయింది. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ లక్ష కోట్ల దోపిడీ చేశారు.దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా?. అవినీతిపరుల పాలిట చండశాసనుడినని మోదీ అన్నారు. కుంగిన మేడిగడ్డ, పగిలిన అన్నారం గురించి మోదీ ఎందుకు మాట్లాడలేదు. మేడిగడ్డను చూడకపోతే మీ పర్యటన వల్ల ఏం లాభం. మోదీకి కేసీఆర్‌ మిత్రులు కాకుంటే.. ఎందుకు చర్యలు తీసుకోరు. రాష్ట్రంలో బీజేపీకి 100చోట్ల డిపాజిట్లు దక్కే పరిస్థితిలేదు."- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Revanth Reddy Speech at Adilabad : అనంతరం, ఆదిలాబాద్ డైట్ మైదానంలో విజయభేరి సభకు హాజరైన రేవంత్‌రెడ్డి... కాంగ్రెస్‌ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కేసీఆర్‌(KCR) సర్కార్‌ అవినీతికి మేడిగడ్డ మేడిపండులా పగిలిపోయిందని ఆరోపించారు. అవినీతిని సహించబోనని హైదరాబాద్‌ పర్యటనలో చెప్పిన మోదీకి.. కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడలేదని ప్రశ్నించారు. వచ్చే 100 నియోజకవర్గాల్లో డిపాజిట్‌లు కోల్పోయే బీజేపీ(BJP).. బీసీని సీఎం చేస్తామని చెప్పి, ఎవరిని మోసం చేస్తుందన్నారు..

"కాంగ్రెస్ అధికారంలోకి రాగానే- ధరణిని రద్దు చేసి మెరుగైన పోర్టల్​ను తీసుకొస్తాం"

Revanth Reddy Speech at Rejendra Nagar : ఆదిలాబాద్‌ పర్యటన అనంతరం, హైదరాబాద్‌కు చేరుకున్న పీసీసీ అధ్యక్షుడు(Revanth Reddy).. రాజేంద్రనగర్‌లో జరిగిన విజయభేరీ సభకు హాజరయ్యారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీయే అని అన్నారు. ఓఆర్‌ఆర్‌, శషాంబాద్‌ విమానాశ్రయాన్ని కట్టింది కాంగ్రెస్‌యేనని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు.

ధనికులు ఇళ్లు కట్టుకుంటే నిబంధనలు అడగని ప్రభుత్వం.. పేదవారు ఇళ్లు నిర్మించుకుంటే జీఓ 111 అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల కరెంట్‌ ముసుగులో వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. 24 గంటల కరెంట్‌ ఇచ్చినట్లు నిరూపిస్తే తాను, మా అభ్యర్థి నామినేషన్‌ వేయమని పేర్కొన్నారు. మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ ఇచ్చి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Revanth Reddy Counter Tweet to KTR Tweet : 'రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ చూసి.. కేటీఆర్​కు ఏం చేయాలో అర్థం కావట్లేదు'

Revanth Reddy Counter Tweet to KTR Tweet : 'కేటీఆర్ ట్వీట్​కు రేవంత్ కౌంటర్.. తెలంగాణకు అసమర్థుల పాలన ఇక అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.