ETV Bharat / state

పెండింగ్​లో ఉన్న వేతనాలు చెల్లించాలి: ఆర్​. కృష్ణయ్య

author img

By

Published : Sep 18, 2020, 10:47 PM IST

హైదరాబాద్ హిమాయత్ నగర్​లోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం ముందు నిర్వహించిన మహా ధర్నాలో ఆర్​. కృష్ణయ్య పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు పెండింగ్​లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

R Krishnaiah On field Assistants in hyderbad
పెండింగ్​లో ఉన్న వేతనాలు చెల్లించాలి: ఆర్​. కృష్ణయ్య

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో గత 14 ఏళ్లుగా గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు పెండింగ్​లో ఉన్న వేతనాలు చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్​లోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం ముందు నిర్వహించిన మహా ధర్నాలో కృష్ణయ్య పాల్గొన్నారు.

ఉపాధి హామీ బాధ్యతలు నిర్వహిస్తున్న మొత్తం 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధులలో కొనసాగిస్తూ... గత డిసెంబర్ మాసం నుంచి పెండింగ్​లో ఉన్న వేతనాలు ఇవ్వడం లేదన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామస్థాయిలో నిత్యం కూలీలకు అందుబాటులో ఉంటూ కేవలం ఉపాధిహామీ పనులనే కాకుండా... ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణకు హరితహరం, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, డంపింగ్ యార్డ్, వైకుంఠ దామాల నిర్మాణం, పల్లెప్రగతి కార్యక్రమం వంటి అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో గ్రామస్థాయిలో ముందుండి పని చేస్తున్నారని తెలిపారు. ఈ కరోనా కష్టకాలంలో వేతనాలు లేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు.

ఇదీ చూడండి: మనుషులకే కాదు.. శునకాలకూ ఓ 'బ్లడ్ బ్యాంక్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.