ETV Bharat / state

'ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి'

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. టీఎస్​పీఎస్సీని తెరాస సర్కారు పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

r krishnaiah demands 2 lakh 50 thousand jobs to be filled in telangana
'ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి'
author img

By

Published : Oct 9, 2020, 3:53 PM IST

తెరాస సర్కారు టీఎస్‌పీఎస్సీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్​లోని కమిషన్ కార్యాలయం ముందు నిరుద్యోగ ఐకాస ఆందోళన చేపట్టింది.

ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా.. మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. వివిధ శాఖల్లో రిటైర్డ్ అయిన నాలుగు వేల మంది ఉద్యోగుల సర్వీస్​ను కొనసాగిస్తున్నారని... వారిని వెంటనే తొలగించి వారి స్థానంలో అర్హులైన ఉద్యోగులను నియమించాలన్నారు. లేదంటే నిరుద్యోగులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు.

ఇదీ చూడండి : నాలెడ్జ్​ అప్​గ్రేడ్​​తో ఉద్యోగ భద్రత: జయేశ్ రంజన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.