ETV Bharat / state

చంపుతామని బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఎంపీ కోమటిరెడ్డి ఫిర్యాదు

author img

By

Published : Mar 11, 2023, 2:12 PM IST

Updated : Mar 11, 2023, 2:23 PM IST

MP Komati Reddy Venkata Reddy Complaint At Banjara Hills Police Station: బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. తనను కొంతమంది చంపుతామని బెదిరిస్తున్న వీడియోలు పోస్ట్​ చేశారంటూ ఎంపీ కోమటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన లెటర్​ ప్యాడ్​పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పీఏతో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నట్లు.. బంజారాహిల్స్​ పోలీసులు తెలిపారు.

mp komatireddy
mp komatireddy

MP Komati Reddy Venkata Reddy Complaint At Banjara Hills Police Station: తెలంగాణలోని కాంగ్రెస్​ పార్టీలో వివాదాలు రోజురోజూకూ ముదురిపోతున్నాయి. రోజుకో వివాదంతో కాంగ్రెస్​ నేతలు వారిలోనే వారే ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రాష్ట్ర పీసీసీ ఉపాధ్యాక్షుడు చెరుకు సుధాకర్​రెడ్డి నల్గొండ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసిన రెండు రోజులు గడవక ముందే.. తాజాగా బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు.

తనను కొంతమంది చంపుతామని బెదిరిస్తున్న వీడియోలు పోస్ట్​ చేశారంటూ ఎంపీ కోమటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన లెటర్​ ప్యాడ్​పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పీఏతో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నట్లు.. బంజారాహిల్స్​ పోలీసులు తెలిపారు. దీంతో కాంగ్రెస్​లో నాయకుల మధ్య ఎంత సమన్వయం ఉందో అని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.

కాంగ్రెస్​ పార్టీ ఉపాధ్యాక్షుడు చెరుకు సుధాకర్​ను బెదిరిస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలు భావోద్వేగంతో చేసినవే అని ఎంపీ కోమటిరెడ్డి ఐదురోజుల క్రితం వివరణ ఇచ్చారు. సుధాకర్​రెడ్డి కుమారుడికి ఫోన్​ చేసి మాట్లాడిన మాటలు వాస్తవమేనని.. కానీ తాను ఆ విధంగా మాట్లాడలేదని.. కావాలనే ఆడియోను ఎడిట్​ చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సుధాకర్​రెడ్డి తనను పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని అనడంతోనే.. మనస్తాపంతో ఈ విధంగా మాట్లాడానని పేర్కొన్నారు.

MP Komati Reddy Venkata Reddy Vs Charaku Sudhkar:అయితే ఈ విషయంపై మాత్రం చెరుకు సుధాకర్​రెడ్డి.. అసహనం వ్యక్తం చేశారు. తనను చంపేస్తానని అతను అనడంతో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసి.. అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్తానని తెలిపారు. అనంతరం ఎంపీ కోమటిరెడ్డిపై నల్గొండ పోలీస్​ స్టేషన్​లో చెరుకు సుధాకర్​ రెడ్డి కుమారుడు సుహాస్​​ తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మానవహక్కుల కమిషన్​కు వెళ్లి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్ల తన కుంటుంబానికి ప్రాణహాని ఉందని.. పోలీసులతో రక్షణ కల్పించాలని ఇదే విషయంపై ఫిర్యాదు చేశారు.

ఇదే విషయమై రాష్ట్ర డీజీపీకి కూడా చెప్పారు. తనను తన తండ్రిని వంద కార్లతో వచ్చి చంపుతానని కోమటిరెడ్డి ఆడియో కాల్​లో బెదిరించారని సుహాస్​​ పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ చిన్నదిగా చూస్తున్నారు.. చంపుతామనడం చిన్నవిషయం కాదని చెరుకు సుధాకర్​రెడ్డి కుమారుడు చెరుకు సుహాస్​ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి:

Last Updated :Mar 11, 2023, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.