ETV Bharat / state

ఎట్టెట్టా - యువజన బృందాలకు గోవా ఆఫర్లు - బూత్ స్థాయి నేతలకు మందు, విందు, పదివేలు పక్కా!

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 11:10 AM IST

MLA Candidates Offers to Youth Groups : రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. వివిధ పార్టీల అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఖర్చు ఎంతైనా వెనకడుగు వేయడం లేదు. ఓ వైపు పార్టీ కోసం పనిచేసే.. యువజన బృందాలకు గెలిచిన తర్వాత గోవా టూర్‌కి పంపిస్తామని హామీ ఇస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో బూత్‌ స్థాయి నాయకులు చివరి వరకూ తమతో ప్రచారంలో ఉండేదుకు అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Election Campaign 2023

MLA Candidates Offers to Youth Groups : తెలంగాణలో ఎన్నికల ప్రచారం (Telangana Assembly Election Campaign) ఊపందుకుంది. ప్రధాన పార్టీలైన బీఆర్​ఎస్, కాంగ్రెస్‌, బీజేపీలు ముఖ్య నేతలతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అభ్యర్థులు, అభ్యర్థిత్వాలు ఖరారైన నేతలు.. తమ అనుచరులు, పార్టీ శ్రేణులతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్​ కోసం కొందరు.. మరో ఛాన్స్​ కోసం మరికొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడటం లేదు.

ఓ వైపు నామినేషన్ ప్రక్రియ జోరు మరోవైపు పార్టీల ప్రచార హోరు

ఇందులో భాగంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో గోవా పేరు వినపడుతోంది. పార్టీ కోసం పనిచేసే.. యువజన బృందాలకు గెలిచిన తర్వాత గోవా టూర్‌కి పంపిస్తామని అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సోషల్ మీడియాలో అభ్యర్థి గురించి సానుకూల ప్రచారం చేయడం, బైకు ర్యాలీలు, పోల్‌ చీటీల పంపిణీ వరకు వారి భాగస్వామ్యం అవసరం. యువత సైతం కొత్త కోరికల చిట్టాను అభ్యర్థుల ముందు పెడుతున్నారు.

Political Parties Election Campaign : ఇప్పటివరకు క్రికెట్‌, ఇతర క్రీడా సామగ్రి కిట్లు కావాలి? యవజన సంఘాలకు భవనాలు కట్టివ్వాలని యువజన బృందాలు కోరేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. మీ కోసం తాము పనిచేస్తామని.. ఎన్నికలు ముగిసిన తర్వాత తమను గోవా టూర్‌కు పంపితే చాలని.. హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన ఒక ఎమ్మెల్యేను కోరారు. హైదరాబాద్‌ శివారులోని పలువురు అభ్యర్థులకు సైతం ఈ తరహా అనుభవమే ఎదురైంది. అయితే గెలవాలే గానీ అదెంత పని అంటూ.. అభ్యర్థులూ హామీ ఇస్తుండడంతో యువజన బృందాలు ప్రచారంలో స్పీడ్‌పెంచాయి.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల పాటలు

Telangana Assembly Election Campaign 2023 : మరోవైపు వివిధ పార్టీల అభ్యర్థులు.. ఎన్నికల ప్రచారంలో (Telangana Election Campaign) పెద్ద సంఖ్యలో జనాలు కనబడేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో అభ్యర్థులకు రోజువారీ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. సాయంత్రం తర్వాత అనుచరగణాన్ని చల్లబరిచేందుకు నిత్యం రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో స్థానికులకు చిర పరిచితులైన బూత్‌ స్థాయి నేతలు చివరి వరకూ ప్రచారంలో కొనసాగేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఒక్కో పోలింగ్‌ బూత్‌లోని ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులకు రోజుకు రూ.10,000 దాకా ఖర్చు పెడుతున్నారు. ఆ రోజు ప్రచారంలో పాల్గొన్న ముఖ్య కార్యకర్తలు మద్యం పార్టీలు చేసుకునేందుకు ఈ మొత్తం ఇస్తున్నారు.

అసంతృప్తులపై పార్టీల బుజ్జగింపు మంత్రం, ప్రచారం కీలకదశకు చేరడంతో ఆపద మొక్కులు

ఈ క్రమంలోనే ప్రచార ర్యాలీల్లో పాల్గొనే వారికి రూ.500 పైన ఇచ్చి అదనంగా భోజనం ఇవ్వాల్సి వస్తోంది. ఒక్కో రోజు కనీసం రూ.10 లక్షల దాకా ఖర్చవుతోందని నేతలు చెబుతున్నారు. కార్యకర్తల్లో ఎక్కడా అసంతృప్తి లేకుండా చూసుకునేందుకు నాయకులు రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారు.

ఓటమితో మొదలెట్టి - ఆపై గెలుపు బండెక్కి, ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోని నేతలెవరో తెలుసా?

పల్లెబాట పట్టిన పార్టీలు - అధికారం దక్కాలంటే ఆమాత్రం తిప్పలు తప్పవు మరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.