ETV Bharat / state

ఖబడ్దార్‌... పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డా.. : శ్రీనివాస్‌ గౌడ్‌

author img

By

Published : May 6, 2022, 3:27 PM IST

Srinivas goud on bandi sanjay: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ విరుచుకుపడ్డారు. తనదైన శైలీలో ఘాటైన విమర్శలు చేశారు. పచ్చటి పాలమూరును విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

MINISTER SRINIVAS GOUD FIRES ON BANDI SANJAY AND JP NADDA
MINISTER SRINIVAS GOUD FIRES ON BANDI SANJAY AND JP NADDA

Srinivas goud on bandi sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కనీస సంస్కారం లేకుండా వీధి రౌడి భాష మాట్లాడుతున్నారని... రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. బండి సంజయ్ కౌన్సిలర్ స్థాయికి కూడా పనికిరారని.. పాదయాత్రల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు వస్తున్నాయని పాదయాత్రలు మొదలు పెట్టి మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

పచ్చటి పాలమూరును విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 20 వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యేదని జేపీ నడ్డా కనీన పరిజ్ఞానం లేని విధంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. తెరాసకు కాళేశ్వరం ఏటీఎం అయితే... ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ భాజపా ఏటీఎంలా అని ప్రశ్నించారు.

ఎల్ఐసీ, పవన్ హన్స్​లకు ఎందుకు తక్కువ ధరలకు అమ్మేశారో... ఎంత అవినీతి జరిగిందో భాజపా నేతలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తెరాస రజాకార్ల పార్టీ కాదని.. భాజపానే బందిపోట్లు, జేబుదొంగల పార్టీ అని శ్రీనివాస్ గౌడ్ విరుచుకుపడ్డారు.

''భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాలమూరు సభా వేదికగా అన్ని అబద్దాలే చెప్పారు. బండి భాష సరిగా లేదు. ఓ వీధిరౌడీ మాట్లాడినట్లు మాట్లాడారు. వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదు. తెరాసకు కాళేశ్వరం ఏటీఎం అయితే... ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ భాజపా ఏటీఎంలా? ఎల్ఐసీ, పవన్ హన్స్​లకు ఎందుకు తక్కువ ధరలకు అమ్మేశారో... ఎంత అవినీతి జరిగిందో భాజపా నేతలు చెప్పాలి?''

- శ్రీనివాస్‌ గౌడ్‌, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖల మంత్రి

Srinivas goud on bjp: భాజపా దేశం పాలిట ఏటీఎం అయిందని విమర్శించారు. ''ఏటీఎం అంటే అమ్మేయడం తాకట్టుపెట్టడం మోదెయ్యడం'' అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రెండు ఉప ఎన్నికల్లో గెలిస్తే భాజపా అధికారంలోకి వస్తోందా? అని ప్రశ్నించారు. తెరాస రజాకార్ల పార్టీ కాదు.. భాజపా అంటే బందిపోట్ల పార్టీ అని మండిపడ్డారు.

నీ ఇంట్లో నుంచి ఏమన్నా గుంజుకున్నమా? వ్యక్తిగతంగా తిడుతున్నావ్.. కౌన్సిలర్ స్థాయికి కూడా సంజయ్ పనికిరారు. అసలు తెలంగాణలో ఎక్కడున్నావ్ సంజయ్.. నాలుక చీరేస్తాం బిడ్డా.. ఆధారాలు లేకుండా సీఎంను తిడతారా? గతంలో దత్తాత్రేయ లాంటి నేతలు భాజపాలో సంస్కారవంతంగా మెదిలారు. ఖబడ్దార్ సంజయ్.. నాలుక చీరేస్తాం. పిచ్చిగా మాట్లాడటం ఆపకపోతే.. కమీషన్ల పార్టీ భాజపా అని ఎల్‌ఐసీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను చౌకగా అమ్మడంతో రుజువైంది. పార్లమెంట్‌లో తెలంగాణకు వస్తున్న ప్రశంసలు నడ్డాకు కనిపించడం లేదా? పది మంది దాక కేంద్ర మంత్రులు వచ్చి తెలంగాణ పథకాలను పొడుగుతున్నారు. మంత్రులు వస్తే మీడియాకు తెలుస్తుందని కార్యదర్శులను పంపిస్తున్నారు.

- శ్రీనివాస్‌ గౌడ్‌, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖల మంత్రి

బండి సంజయ్‌పై విరుచుకుపడ్డ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.