ETV Bharat / state

KTR: 'దగాపడ్డ దేశ ప్రజలను గెలిపించడానికే బీఆర్​ఎస్.. దిల్లీలో అడుగుపెట్టింది'

author img

By

Published : May 4, 2023, 10:13 PM IST

KTR Comments on BRS Office Opening in Delhi: దిల్లీలో బీఆర్​ఎస్ కార్యాలయ ప్రారంభం.. పార్టీ శ్రేణులతో పాటు యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్ పనికి రాదని దేశ ప్రజలు గ్రహించిన నేపథ్యంలో 'గోల్డెన్ తెలంగాణ మోడల్' పైనే ప్రస్తుతం చర్చ జరుగుతోందన్నారు. నాడు ఉద్యమ పార్టీగా పురుడుపోసుకుని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన గులాబీ జెండా.. ఇప్పుడు దశాబ్దాల పాటు దగాపడ్డ దేశ ప్రజలను గెలిపించడానికే హస్తినలో అడుగుపెట్టిందన్నారు.

KTR
KTR

KTR Comments on BRS Office Opening in Delhi: జాతీయ రాజకీయ యవనికపై భారత రాష్ట్ర సమితి బలమైన ముద్ర వేయడం ఖాయమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్ పనికి రాదని దేశ ప్రజలు గ్రహించిన నేపథ్యంలో 'గోల్డెన్ తెలంగాణ మోడల్' పైనే ప్రస్తుతం చర్చ జరుగుతోందన్నారు. దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా.. బీఆర్​ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి గులాబీ సైనికుడి బాధ్యత మరింత పెరిగింది: దిల్లీలో బీఆర్​ఎస్ కార్యాలయ ప్రారంభం.. పార్టీ శ్రేణులతో పాటు యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్​ఎస్​ను అజేయ శక్తిగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్న ప్రతి గులాబీ సైనికుడి బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరింత సమరోత్సాహంతో కదం తొక్కాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ఇచ్చిన 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా మారుమోగుతోందన్నారు. నాడు తెలంగాణ సాధన కోసం ఏ సంకల్పంతో బయలుదేరామో.. అదే స్ఫూర్తితో దేశం కోసం కదం తొక్కాలని, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమించకుండా పని చేద్దామంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

నాడు జలదృశ్యం.. నేడు దిల్లీలో అద్వితీయ దృశ్యం: జలదృశ్యంలో ఒకరితో మొదలైన ప్రయాణం.. మహాప్రస్థానమై.. దేశ రాజధానిలో సగర్వంగా అడుగుపెట్టిందని కేటీ రామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పార్టీ కార్యశ్రేణులు పట్టుదలతో తెలంగాణ ఆత్మగౌరవ పతాకమైన బీఆర్​ఎస్ జెండా దిల్లీలో రెపరెపలాడిందని కేటీఆర్ అన్నారు. ఉద్యమ నాయకుడే.. ఉత్తమ పాలకుడని యావత్ దేశం కొనియాడుతున్న వేళ.. బీఆర్​ఎస్ పార్టీ జాతీయ ప్రస్థానం నేడు ఒక చారిత్రక అవసరమన్నారు.

దగాపడ్డ దేశ ప్రజలను గెలిపించడానికే హస్తినలో అడుగుపెట్టింది: నాడు ఉద్యమ పార్టీగా పురుడుపోసుకుని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన గులాబీ జెండా... ఇప్పుడు దశాబ్దాల పాటు దగాపడ్డ దేశ ప్రజలను గెలిపించడానికే హస్తినలో అడుగుపెట్టిందని కేటీఆర్ అన్నారు. ఉద్యమ పాఠాల నుంచి మొదలుకుని.. యావత్ దేశానికి ఉజ్వలమైన పరిపాలనా పాఠాలు నేర్పిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కిందన్నారు. ఈ మహా ప్రస్థానంలో.. బీఆర్​ఎస్ వేసిన ప్రతి అడుగు సంచలనమని.. అధికార పార్టీగా తీసుకున్న ప్రతి నిర్ణయం ఓ సువర్ణ అధ్యాయమని కేటీఆర్ గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.