ETV Bharat / state

Errabelli: 'ఎన్ని ఖాళీలున్నాయి... రేపటిలోగా చెప్పండి'

author img

By

Published : Jul 18, 2021, 4:31 PM IST

Minister
పంచాయతీరాజ్‌

హైదరాబాద్ ఖైరతాబాద్​లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. పంచాయతీ రాజ్ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పాలని అధికారులను ఆదేశించారు. ఖాళీల వివరాలను రేపటిలోపు ఆర్థిక శాఖకు నివేదించాలని సూచించారు.

రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి అనుబంధ శాఖల్లో ఉద్యోగుల ఖాళీల వివరాలను రేపటి లోపు ఆర్థిక శాఖకు నివేదించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు (Minister Errabelli dayakar rao) అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్... నిర్ణయించిన విషయాన్ని అధికారుల సమీక్షలో ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్​ ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయా శాఖలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఏయే శాఖలో ఎన్ని...

ఇందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, సెర్ఫ్, శ్రీనిధి, తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్​మెంట్, ఇజీఎంఎం, స్వామి రామానంద తీర్ధ ఇనిస్టిట్యూట్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ఎన్ని రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, కాంటిజెన్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతం ఎంత మంది అధికారులు, ఉద్యోగులు పని చేస్తున్నారు? ఇంకా ఎంత మంది భర్తీ చేయాలనే మొదలగు అంశాలను కూలంకుషంగా అయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలనుసారంగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను రేపటిలోగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు సమర్పించాలని ఆయన కోరారు. పరిపాలన సంస్కరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లాలలో, మండలాలలో కావాల్సిన మేర సిబ్బంది పని చేస్తున్నారా? ఇంకా ఎంత సిబ్బంది అవసరం మొదలగు అంశాలను సమర్పించాలని అయన కోరారు.

సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి ఉప కార్యదర్శి ఆయేషా, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ చీఫ్ సంజీవరావు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ చక్రవర్తి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు, సెర్ఫ్, టీఎస్​డీఆర్డీ, ఈజీఎంఎం, స్వామి రామానంద తీర్ధ ఇనిస్టిట్యూట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.