ETV Bharat / state

దేశంలో ప్రధాన టెక్​ హబ్​గా హైదరాబాద్​ అవతరించింది: మంత్రి కేటీఆర్​

author img

By

Published : Nov 4, 2020, 7:50 PM IST

Updated : Nov 4, 2020, 8:49 PM IST

తక్కువ సమయంలో ప్రముఖ బహుళ జాతి సంస్థలను తెలంగాణ ఆకర్షించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. గత ఆరేళ్లలో భాగ్యనగరం.. దేశంలో ప్రధాన టెక్​ హబ్​గా అవతరించిందన్నారు. హైదరాబాద్ నాలెడ్జీ సిటీలో నైట్​ ఫ్రాంక్​ ఇండియా కొత్త కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. నైట్​ ఫ్రాంక్​ తయారు చేసిన వర్క్​ ఫ్రమ్​ హైదరాబాద్​ రిపోర్టును విడుదల చేశారు.

దేశంలో ప్రధాన టెక్​ హబ్​గా హైదరాబాద్​ అవతరించింది: మంత్రి కేటీఆర్​
దేశంలో ప్రధాన టెక్​ హబ్​గా హైదరాబాద్​ అవతరించింది: మంత్రి కేటీఆర్​

దేశంలో ప్రధాన టెక్​ హబ్​గా హైదరాబాద్​ అవతరించింది: మంత్రి కేటీఆర్​

గత ఆరేళ్లలో హైదరాబాద్.. దేశంలో ప్రధాన టెక్ హబ్​గా అవతరించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నాలెడ్జీ సిటీలో నైట్ ఫ్రాంక్ ఇండియా కొత్త కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్​తో కలిసి.. నగరాభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, మౌలిక సదుపాయాలు, స్థిరాస్తిని విశ్లేషిస్తూ నైట్ ఫ్రాంక్ తయారు చేసిన వర్క్​ ఫ్రమ్ హైదరాబాద్ రిపోర్టును విడుదల చేశారు.

తక్కువ సమయంలో ప్రముఖ బహుళ జాతి సంస్థలను తెలంగాణ ఆకర్షించిందని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. సుస్థిర సాంకేతికతలను తయారు చేసేందుకు భవిష్యత్తులో కూడా ఇదే తీరులో పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో 4.16 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్​డీపీ నేడు 6.63 లక్షల కోట్లకు చేరిందన్నారు. 8.08 శాతంతో దేశ సగటు ఆర్థిక వృద్ధి కంటే ఎక్కువ సాధించామని కేటీఆర్​ పునరుద్ఘాటించారు.

ఇదీ చదవండి: '2030 వరకు లైఫ్ సైన్సెస్​లో తెలంగాణ ఆసియాలోనే నెంబర్​వన్ కావాలి'

Last Updated : Nov 4, 2020, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.