ETV Bharat / state

గోదావరి ఎక్స్​ప్రెస్​ ఘటన..LHB బోగీల వల్లే పెద్ద ముప్పు తప్పిందట

author img

By

Published : Feb 16, 2023, 1:08 PM IST

Godavari Express: గోదావరి ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పిన ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంపై అధికారులు వివరణ ఇచ్చారు. ఇంత పెద్ద ముప్పు తప్పడానికి కారణమేంటో చెప్పారు. ఎల్​హెచ్​బీ బోగీలను ఏర్పాటు చేయడం వల్లనే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. బోగీలను ఇవాళ పట్టాలపై నుంచి తొలగించాల్సి పనులు ఉండటం వల్ల పలు రైళ్లను రెండురోజులు పాటు రద్దు చేశారు. ఇంతకీ ఈ ఎల్​హెచ్​బీ బోగీలు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు. అవి ఎలా పని చేస్తాయో తెలుసుకుందామా..

godavari express
గోదావరి ఎక్స్​ప్రెస్​

Godavari Express Accident: విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్​ వస్తున్న గోదావరి ఎక్స్​ప్రెస్​ బీబీనగర్​ వద్ద పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.. అయితే రైలు పట్టాలు తప్పిన బోగీలకుగానీ, అందులో ఉన్న ప్రయాణికులకు గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి ఎల్​హెచ్​బీ బోగీలే కారణమని అధికారులు తెలిపారు. దీంతో పెను ప్రమాదమే తప్పి.. అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

ఈ ఎక్స్​ప్రెస్​లో ఎయిర్​ కండీషన్​ టెక్నాలజీ ఉండడంవల్ల ఆరు బోగీలు కేవలం విడిపోవడం మాత్రమే జరిగిందని.. దీంతో పెను ప్రమాదమే తప్పిందని రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పూర్తిగా విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విడిపోయిన బోగీలలో జనరల్​లో సుమారు 120 ఉండవచ్చని, మిగిలిన స్లీపర్​ కోచ్​లలో 300 మంది ప్రయాణిస్తున్న ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ గోదావరి ఎక్స్​ప్రెస్​లో సుమారు 1500 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అసలేంటీ ఎల్​హెచ్​బీ బోగీలు అంటే: గోదావరి ఎక్స్​ప్రెస్​కు యాంటీ టెలిస్కోపిక్​ టెక్నాలజీతో తయారు చేసిన ఈ ఎల్​హెచ్​బీ(లింక్​ హాఫ్​మన్​ బుష్​) బోగీలు అమర్చడం వల్ల కోచ్​లు ఒకదానితో ఒకటి ఢీ కొనలేదు. అవి పక్కకు వంగి పడిపోలేదు. ఒకవేళ రైలు పట్టాలు తప్పినప్పుడు కోచ్​లు అనేవి విడిపోతాయి. దీనివల్ల పెను ప్రమాదాలు తప్పుతున్నాయి. తక్కువ నష్టం జరుగుతుంది. మొట్టమొదటగా జర్మనీలో తయారయిన ఈ ఎల్​హెచ్​బీ బోగీలను.. 2000వ సంవత్సరం నుంచి భారతదేశంలో వినియోగిస్తున్నారు.

మనదేశంలో మొదటిగా శతాబ్ది ఎక్స్​ప్రెస్​కు 24 ఎల్​హెచ్​బీ బోగీలను అమర్చారు. ఇవి మంచి ఫలితాలను ఇవ్వడంతో అధికంగా వినియోగించడానికి.. పంజాబ్​లోని కపుర్తలాలో వీటిని తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఎయిర్​ కండిషన్​ బోగీలను తయారు చేస్తున్నారు. వీటి వల్ల ఒకవేళ రైలు పట్టాలు తప్పిన ఎయిర్​ డిస్క్​ బ్రేక్​లు, ఆటోమేటిక్​ బ్రేక్​ సిస్టమ్​ ఉండడంతో ఒక బోగీపైకి మరోకటి వెళ్లలేదు.

పలు రైళ్లు రద్దు: గోదావరి ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పడం వల్ల రైల్వే సిబ్బంది ట్రాక్​ను పునరుద్ధరించడం వల్ల ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నేడు, రేపు 19 రైళ్లను రద్దు చేసింది. పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్​ బయలుదేరాల్సిన వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఉదయం 5.45గంటలకు బదులు 8.45గంటలకు బయలుదేరింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గ్రహించాలని రైల్వేశాఖ సూచించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.