ETV Bharat / state

త్వరలో ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ కేంద్రాలు.. ఎక్కడంటే?

author img

By

Published : Jan 5, 2023, 12:23 PM IST

Electric Vehicle Charging Stations in Hyderabad: వివిధ ప్రైవేట్​ సంస్థలు ఎలక్ట్రిక్​ వాహనాలే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం వాహనాలకు డీజిల్​, పెట్రోల్ ఉన్న పెట్రోల్​ బంక్​లు​ ఎంత అవసరమో అలానే ఎలక్ట్రిక్​ వాహనాలకు ఛార్జింగ్​ కేంద్రాలు అంతే అవసరం. ఇప్పటికే కొన్ని నగరాల్లో వీటిని ఏర్పాటు చేశారు. త్వరలోనే హైదరాబాద్​లో ఏర్పటు చేయనున్నట్లు రెడ్కో చైర్మన్​ వై. సతీష్​ రెడ్డి తెలిపారు.

Electric Vehicle Charging Stations in Hyderabad
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ కేంద్రాలు

Electric Vehicle Charging Stations in Hyderabad: హైదరాబాద్‌లోని త్వరలో 150 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నట్లు రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి తెలిపారు. కేవలం 30 నుంచి 45 నిమిషాల్లో కారు ఛార్జింగ్ పూర్తవుతుందన్నారు. వాహనదారులు ఇతర సంస్థలతో పోలిస్తే అతి తక్కువ ధరతో వాహనాలు ఛార్జింగ్ చేసుకోవచ్చన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దుర్గంచెరువు దగ్గర రెడ్కో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ మెషిన్‌ను సతీష్‌రెడ్డి పరిశీలించారు.

ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం దేశంలోనే ప్రథమంగా సేవా రుసుం ముందుగా నిర్ణయించిన రాష్ట్రంగా, పెద్దమొత్తంలో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంగా కూడా తెలంగాణ ఘనత సాధించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు వేగంగా పూర్తి చేయగలుగుతున్నామని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.