ETV Bharat / state

వైతెపాకు ఈసీ గుర్తింపు...​ సంబరాల్లో పార్టీ శ్రేణులు

EC Green Signal to YSRTP: వైఎస్సార్​ తెలంగాణ పార్టీని గుర్తిస్తూ ఎన్నికల కమిషన్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహం నెలకొంది. హైదరాబాద్​ లోటస్​ పాండ్​లోని పార్టీ కార్యాలయంలో.. అధ్యక్షురాలు షర్మిలకు శుభాకాంక్షలు తెలియజేసి సంబరాలు చేసుకున్నారు.

ec green signal to ysrtp
వైఎస్సార్​టీపీకి ఎన్నికల కమిషన్​ గ్రీన్​ సిగ్నల్
author img

By

Published : Feb 23, 2022, 4:09 PM IST

Updated : Feb 23, 2022, 5:05 PM IST

EC Green Signal to YSRTP: వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఎన్నికల కమిషన్ గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఆ పార్టీ రిజిస్ట్రేషన్​కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఈసీ నిర్ణయంపై హైదరాబాద్​ లోటస్ పాండ్​లోని వైతెపా కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందోత్సవాలు జరుపుకొన్నారు.

పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు.. పార్టీ నేతలు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షర్మిల కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ నేతలు స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా పాల్గొన్నారు.

ఆ అంశాలే ప్రధాన అజెండాగా

గతేడాది జులై 8న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని.. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆ రోజు.. పార్టీ పేరును షర్మిల ప్రకటించారు. వైతెపా ప్రధాన అజెండా సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం అని షర్మిల ప్రకటించారు. తెలంగాణలో వైఎస్సార్​ సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టినట్లు చెప్పారు. కాగా వైతెపాను గుర్తిస్తూ నేడు ఈసీ ప్రకటించింది.

ఇదీ చదవండి: మల్లన్నసాగర్‌ కాదు..ఇది తెలంగాణ జలసాగర్‌: కేసీఆర్​

Last Updated : Feb 23, 2022, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.