ETV Bharat / state

రాష్ట్రంలో 36,221కి చేరిన కరోనా బాధితులు.. 365 మంది మృతి

author img

By

Published : Jul 14, 2020, 4:53 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా 1,550 నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 36,221కు చేరింది. వైరస్​ బారిన పడి మరో 9 మంది మరణించారు. మృతుల సంఖ్య 365కు చేరింది. సోమవారం మరో 1,197 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 23,679కు చేరింది.

covid cases increasing rapidly in telangana discharges also more
రాష్ట్రంలో 36,221కి చేరిన కరోనా బాధితులు.. 365 మంది మృతి

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తోంది. కొత్తగా 1,550 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 36,221కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 926 కేసులు జీహెచ్​ఎంసీ పరిధిలోనే బయటపడినట్లు తెలిపింది. రంగారెడ్డి 212 మందికి వైరస్‌ సోకింది. కరీంనగర్‌లో ఏకంగా 86 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. మేడ్చల్‌ 53, నల్గొండ జిల్లాలో 41 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఖమ్మంలో 38, కామారెడ్డిలో 33 మందిలో వైరస్‌ను గుర్తించారు. సంగారెడ్డిలో 19, వరంగల్‌ అర్బన్‌లో 16, మహాబూబాబాద్‌, మహాబూబ్‌నగర్‌ జిల్లాల్లో 13 చొప్పున కరోనా కేసులు వెలుగు చూశాయి.

భద్రాద్రి, జనగామ, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో పదేసి కేసులు వచ్చాయి. వరంగల్‌ రూరల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో 8 కేసులు చొప్పున నమోదయ్యాయి. సిరిసిల్ల జిల్లాలో ఏడుగురికి వైరస్‌ సోకింది. భూపాలపల్లి, పెద్దపల్లి, మెదక్‌ జిల్లాల్లో ఆరేసి కేసులు... యాదాద్రి, గద్వాల్‌ జిల్లాల్లో ఐదేసి కొత్త కేసులు బయటపడ్డాయి. వికారాబాద్‌లో ముగ్గురు, నాగర్‌కర్నూల్‌లో ఇద్దరు మహమ్మారి బారిన పడ్డారు. నిర్మల్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, వనపర్తి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

సోమవారం 1,197 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు డిశ్చార్జి అయ్యిన వారి సంఖ్య 23,679కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,178 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా మరో 9 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 365కి చేరింది. సోమవారం మరో 11, 525 మందికి పరీక్షలు నిర్వహించారు. ఫలితంగా ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్య.. లక్షా 81, 849 మంది చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇవీచూడండి: కరోనా రాకుండా ఏం చేయాలి? పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.