ETV Bharat / state

జోరుగా 'హాథ్‌ సే హాథ్‌ జోడో' యాత్ర.. వారానికి ఓ సమస్యపై ఛార్జిషీట్‌

author img

By

Published : Feb 1, 2023, 2:23 PM IST

Hath Se Hath Jodo Yatra in Telangana: హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వేదికగా ఎంచుకుంది. ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పార్టీ బలోపేతం, బీఆర్ఎస్ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లేందుకు సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటోంది. రెండు నెలలపాటు కొనసాగనున్న ఈ యాత్రలో వారానికి ఒక సమస్యపై ఛార్జిషీట్‌ విడుదల చేస్తూ క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది.

Hath Se Hath Jodo Yatra in Telangana
Hath Se Hath Jodo Yatra in Telangana
రాష్ట్రంలో జోరుగా హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర

Hath Se Hath Jodo Yatra in TS State: ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివిధ రూపాల్లో జనంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోంది. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగిసిన తరువాత ఆ యాత్రకు కొనసాగింపుగా దేశవ్యాప్తంగా రెండు నెలలపాటు హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ చేపట్టాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఇప్పటికే జవనవరి 26న లాంఛనంగా ప్రారంభించిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర దేశవ్యాప్తంగా రెండు నెలలు కొనసాగనుంది.

Hath Se Hath Jodo Yatra in Telangana: ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ పరిపాలనలో చోటు చేసుకున్న వైఫల్యాలను ఎండగట్టే పనిని మొదలు పెట్టింది. బీఆర్ఎస్ ఎనిమిదేళ్లుగా ఏయే వర్గాలను నిర్లక్ష్యం చేసింది. ఆయా వర్గాలు పడుతున్న ఇబ్బందులు ఏంటి.. ఏయే శాఖలు నిర్వీర్యం అయ్యాయి. వాటి వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంటి అనే అంశాలను తెరపైకి తీసుకొచ్చే దిశలో ముందుకు వెళుతోంది. ప్రతి వారం ఒక ప్రధాన సమస్యపై ఛార్జిషీట్‌ విడుదల చేయాలని నిర్ణయించింది.

హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర నిర్వహణ పర్యవేక్షణకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వరరెడ్డి నేతృత్వంలో 12 మందితో కూడిన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమస్యల వారీగా ఛార్జిషీట్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సమస్యలను గుర్తించిన నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజల బాధలను ఛార్జిషీట్లలో పొందుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

బీఆర్ఎస్ ఎనిమిదేళ్లలో ఇచ్చిన హామీల అమలు తీరును ఎండగడుతూ మొదటి ఛార్జిషీట్‌ను ఏలేటి మహేశ్వరరెడ్డి నేతృత్వంలో కమిటీ విడుదల చేసింది. వైద్య ఆరోగ్యశాఖ తీరు తెన్నులు అందులో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపుతూ రెండో ఛార్జి షీట్‌ ప్రకటించింది. మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేసి, ఆసుపత్రి నిర్మించినట్లు మంత్రి హరీశ్​రావు చెప్పిన మాటలు వాస్తవం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ కార్యక్రమాల వల్ల క్యాడర్‌లో కదలిక రావడంతోపాటు పార్టీ బలోపేతం అవుతుందని నాయకత్వం అంచనా వేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.