ETV Bharat / state

IAMC Inauguration:హైదరాబాద్​లో ప్రతిష్ఠాత్మక కేంద్రం.. ప్రారంభించనున్న సీజేఐ

author img

By

Published : Dec 18, 2021, 4:34 AM IST

IAMC Inauguration: రాజధాని నగరంలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐఏఎంసీ) నేడు ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.

International Arbitration and Mediation Center in Hyderabad.
హైదరాబాద్​లో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం

IAMC Inauguration in hyderabad: హైదరాబాద్​లో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్​ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రాలు లేనందున హైదరాబాద్​లో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జూన్ 14న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. కేసీఆర్ వెంటనే అంగీకరించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు.

IAMC in nanakram guda: నగరంలోని నానక్​రాంగూడలోని ఫీనిక్స్ వీకే టవర్​లో 25వేల చదరపు అడుగులతో ఐఏఎంసీని సిద్ధం చేశారు. ఐఏఎంసీ కేంద్రాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సీజేఐ ఎన్వీ రమణకు అప్పగించనున్నారు. అనంతరం వెబ్ సైట్​ను కేసీఆర్ ప్రారంభిస్తారు. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో భూమి కేటాయించనున్నట్లు ఈనెల 4న జరిగిన ఐఏఎంసీ పరిచయ కార్యక్రమంలో సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎంసీ ట్రస్టీలుగా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హిమాకోహ్లి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.రవీంద్రన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.