ETV Bharat / state

'అవినీతిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి'

author img

By

Published : Feb 27, 2020, 8:23 AM IST

బ్యాంకుల్లో అవినీతిని అరికట్టేందుకు జీరో టోలరెన్స్​ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా చీఫ్​ విజిలెన్స్​ ఆఫీసర్​ పరశురామ్​ పండా తెలిపారు. తెలంగాణ రీజినల్‌ మేనేజర్స్‌తో పాటు హైదరాబాద్‌ బ్రాంచ్‌ మేనేజర్స్‌తో ఆయన సమావేశమయ్యారు.

central bank of india chief vigilence officer parashuram spoke on corruption
'అవినీతిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి'

దేశాభివృద్ధికి అవినీతి అనేది పెద్ద అవరోధంగా మారిందని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ పరుశురామ్‌ అన్నారు. అవినీతిని రూపుమాపేందుకు ప్రతి పౌరుడు ముందుకు రావాలని ఆయన కోరారు. మొండి బకాయిల వసూళ్లపై చర్చించేందుకు తెలంగాణ రీజినల్‌ మేనేజర్స్‌తో పాటు హైదరాబాద్‌ బ్రాంచ్‌ మేనేజర్స్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవినీతిని అరికట్టడం, విజిలెన్స్‌ తనిఖీలు వంటి అంశాలను సిబ్బందికి వివరించారు.

అవినీతి రహిత సేవలు అందించే దిశగా సిబ్బంది ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. బ్యాంకులో సిబ్బంది ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. బ్యాంకుల్లో అవినీతిని అరికట్టేందుకు జీరో టోలరెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు.

'అవినీతిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి'

ఇవీ చూడండి: మండలి స్థానాలపై సీనియర్​ నేతల మక్కువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.