ETV Bharat / state

DK Aruna: 'ఓటమి భయంతోనే ఈవీఎంలు, వీవీప్యాట్లు మారుద్దామనే ఆలోచన'

author img

By

Published : Oct 31, 2021, 1:01 PM IST

హుజూరాబాద్​ ఉప ఎన్నిక(Huzurabad bypoll)లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ ఎన్నికల ప్రధాన అధికారికి భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఓటమి భయంతోనే ఈవీఎంలు, వీవీ ప్యాట్లు మారుద్దామనే ఆలోచన చేశారంటూ మండిపడ్డారు. వీవీ ప్యాట్ల తరలింపుపై సీబీఐ విచారణ జరపాలని కోరారు.

DK Aruna on vvpats malfunctioning
హుజూరాబాద్​ ఉపఎన్నికలో వీవీ ప్యాట్ల తరలింపు

స్ట్రాంగ్ రూమ్‌లకు వెళ్లాల్సిన వీవీ ప్యాట్లు బయటకు ఎలా వచ్చాయని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) ప్రశ్నించారు. కేవలం డబ్బు ఉన్నవాళ్లే రాజకీయం చేసే పరిస్థితులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక(Huzurabad bypoll)లో వీవీ ప్యాట్ల తరలింపుపై.. హైదరాబాద్​లో ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్​ గోయల్​కు పార్టీ నేతలు డీకే అరుణ, రాజా సింగ్​, రామచందర్​ రావు ఫిర్యాదు చేశారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. వీవీ ప్యాట్ల తరలింపుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు డీకే అరుణ మీడియాతో మాట్లాడారు.

ఒక ఉపఎన్నికకు వందల, వేల కోట్లు ఖర్చు చేశారు: డీకే అరుణ

అధికారులదీ అదే తీరు

ప్రైవేట్ కారులో వీవీ ప్యాట్ల తరలింపుపై ఫిర్యాదు చేశామని డీకే అరుణ(DK Aruna) అన్నారు. వీవీ ప్యాట్లు తరలించే బస్సులను తెరాస నేత హోటల్‌ వద్ద ఆపారన్న ఆమె.. బస్సులోని వీవీ ప్యాట్ బాక్సును కారులో పెట్టారని ఆరోపించారు. భద్రత లేకుండా ఈవీఎంలను ఎందుకు తరలించారని ప్రశ్నించారు. అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు.

ఓటుకు రూ. ఆరు, ఏడు వేలు చొప్పున పంచారు. ఒక ఉపఎన్నికకు వందల, వేల కోట్లు ఖర్చు చేశారు. కేవలం డబ్బు ఉన్నవాళ్లే రాజకీయం చేసే పరిస్థితులు తెచ్చారు. అహంకారంతో ఉన్న కేసీఆర్‌కు హుజూరాబాద్ ప్రజలు గుణపాఠం చెప్పారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడింది. వీవీ ప్యాట్ల తరలింపుపై విచారణ జరపాలని సీఈఓను కోరాం. -డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

డబ్బులు ఎందుకు పంచినట్లు.?

అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలైతే డబ్బులు ఎందుకు పంచారని డీకే అరుణ(DK Aruna) ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఈవీఎంలు, వీవీప్యాట్ల మారుద్దామనే ఆలోచన చేశారని విమర్శించారు. ఒక ఉపఎన్నికకు వందల, వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు సీబీఐతో విచారణ జరపాలని ఎన్నికల అధికారిని కోరినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: Huzurabad by poll 2021 : ఓటు వేసే అవకాశం దక్కని 20 మంది అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.