ETV Bharat / state

'వాళ్లు రిగ్గింగ్ చేసినా... గెలిచేది మాత్రం మేమే'

author img

By

Published : Dec 2, 2020, 12:19 PM IST

Updated : Dec 2, 2020, 12:25 PM IST

స్థానిక నేతలు అధికారులను ఒత్తిళ్లకు గురిచేసి... మజ్లిస్ నేతలు రిగ్గింగ్​కు పాల్పడ్డారని భాజపా నేతలు ఆరోపించారు. బ్యాలెట్​ పేపర్ల విధానమే రిగ్గింగ్​కు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్​ శాతం తగ్గినా... భాజపా విజయం సాధిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

bjp-leaders-complaint-against-on-mim-party-leaders
'వాళ్లు రిగ్గింగ్ చేసినా... గెలిచేది మాత్రం మేమే'

భాజపా నేతలు ఎమ్మెల్సీ రాంచందర్​రావు, ఆంటోనిరెడ్డి ఎన్నికల కమిషనర్​ను కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్‌ రిగ్గింగ్‌కు పాల్పడిందని వారు ఆరోపించారు. పాతబస్తీలో మజ్లిస్‌ పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

''మేము సమాచారం ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యం చేశారు. నిన్న సాయంత్రం కొన్ని బూత్‌లలో ఆకస్మాత్తుగా పోలింగ్‌ పెరిగింది. ఝాన్సీబజార్‌, పురానాపూల్‌ పోలింగ్‌ బూతుల్లో 94 శాతం పైగా పోలింగ్‌ జరిగింది. రిగ్గింగ్‌ జరిగిందని చెప్పాడానికి ఇదే నిదర్శనం. ఈ విషయంపై విచారణ జరిపి వాస్తవాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ పోలింగ్‌ బూత్‌లలోకి వెళ్లినట్లు సమాచారం ఉంది.''

'వాళ్లు రిగ్గింగ్ చేసినా... గెలిచేది మాత్రం మేమే'

- రాంచదర్​రావు, ఎమ్మెల్సీ

స్థానిక నేతలు అధికారులను ఒత్తిళ్లకు గురిచేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని భాజపా నేతలు ఆరోపించారు. బ్యాలెట్‌ పేపర్ల విధానమే రిగ్గింగ్‌కు కారణం వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా 90 నుంచి 100 సీట్లను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలింగ్‌ శాతం కొంత తగ్గినా... భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: చార్మినార్ ఎమ్మెల్యే రిగ్గింగ్​కు పాల్పడ్డారంటూ భాజపా ధర్నా

Last Updated :Dec 2, 2020, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.