ఈ రోజు ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ రాష్ట్రం వరకు సముద్రమట్టానికి 1.5కీమీ ఎత్తు వరకు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని(rains in telangana) వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో ప్రకటించారు. రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు(weather report) పడుతాయని తెలిపారు. నిన్న మరత్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1కిమీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీనపడిందన్నారు.
ఏపీలోను వర్షాలు
ఏపీలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయి. దీంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని వెల్లడించింది.
ఇదీ చూడండి: Rains in Telangana: రాష్ట్రంలో రాగల మూడ్రోజులు.. మోస్తరు వర్షాలు