ETV Bharat / state

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సమావేశానికి కేటీఆర్‌కు ఆహ్వానం

author img

By

Published : Aug 17, 2022, 8:23 PM IST

Zurich Invitation to KTR మంత్రి కేటీఆర్‌కు అరుదైన ఘనత దక్కింది. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సమావేశానికి ఆహ్వానం అందింది. అక్టోబర్ 4న స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిచ్‌లో జరిగే ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి రావాలని కేటీఆర్‌కు ఆహ్వానం లభించింది.

KTR
KTR

Zurich Invitation to KTR ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సమావేశానికి రావాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు పిలుపొచ్చింది. అక్టోబర్ 4న స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిచ్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా లీడర్స్‌ సిరీస్‌ సమావేశానికి రావాలని ఆహ్వానం అందింది. ఈ భేటీలో ఆసియా, యూరప్ దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఆహ్వానం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆసియా-యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితులతో దెబ్బతింటున్న ప్రముఖ కంపెనీల వ్యాపార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఆసియా, యూరప్ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. మీలాంటి గౌరవనీయమైన, ప్రభావవంతమైన వ్యక్తుల మధ్య అర్థవంతమైన, ఆలోచనాత్మకమైన చర్చను నిర్వహించడం మా లక్ష్యం అని మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన లేఖలో ఆసియా లీడర్స్ సిరీస్ వ్యవస్థాపకుడు కల్లమ్ ఫ్లెచర్ తెలిపారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో ఆలోచనలు పంచుకునేందుకు ఇదో చక్కటి వేదిక అవుతోందన్నారు. ఈ సమావేశానికి సర్ జాన్ స్కార్లెట్, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎమ్‌ఐ6) మాజీ చీఫ్, మార్గరీట లూయిస్-డ్రేఫస్, ఎల్‌డీసీ గ్రూప్ ఛైర్మన్ లార్డ్ జిమ్ ఓ'నీల్, గోల్డ్‌మన్ సాచ్స్ అసెట్ మేనేజ్‌మెంట్ మాజీ ఛైర్మన్ ప్రొ. విడాకైక్జా, నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ జోర్డి గువల్, బ్యాంక్ ఆఫ్ చైనాలో యూకే బోర్డు సభ్యుడు డాక్టర్ గెరార్డ్ లియోన్స్, హెచ్‌ఎస్‌బీసీ మాజీ గ్రూప్ సీఈవో అండ్ ఛైర్మన్ లార్డ్ స్టీఫెన్ గ్రీన్ తదితరులు పాల్గొననున్నారు.

ఇవీ చదవండి: కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్​టికెట్లు విడుదల

మోదీ అంగీకారంతోనే ఆ కేసు దోషుల్ని విడుదల చేశారా, కాంగ్రెస్ సూటి ప్రశ్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.