AC Helmets for Hyderabad Traffic Police : హైదరాబాద్ రోడ్లపై ప్రయాణమంటే ఓ వైపు వాహనాల హారన్ల మోతలు.. మరోవైపు కాలుష్యంతో సావాసమనే చెప్పాలి. ఇదీ రోజువారి ప్రయాణికుల ఆవేదన. మరీ ఇలాంటి నేపథ్యంలో విధులు నిర్వహిసున్నారు ట్రాఫిక్ సిబ్బంది (Traffic Police). ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో భాగంగా వారికి ఇది తప్పనిసరి. కానీ వారు అనునిత్యం వాహనాల మధ్య ఉండటంతో అనేక అవస్థలు పడాల్సి వస్తోంది.
ట్రాఫిక్ నియంత్రణకు రంగంలోకి ఉన్నతాధికారులు, రద్దీ వేళలపై ప్రత్యేక దృష్టి
AC Helmets for Traffic Police : ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఎదుర్కొనే అవస్థలను కొంత వరకు తగ్గించడానికి ఉన్నతాధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎండా కాలంలో ట్రాఫిక్ సిబ్బందికి ఇబ్బందులు మరింత ఎక్కువ. ఓవైపు శబ్ధ కాలుష్యం ఎలాగూ తప్పదు. ఇంకోవైపు ఎండ వేడిమికి కొన్నిసార్లు వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇందులో భాగంగానే కూడళ్లలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బందికి ఏసీ హెల్మెట్లు (AC Helmets) అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారులు. తాజాగా హైదరాబాద్‌లో ట్రయల్ రన్ ప్రారంభించారు.
Cooling Helmets for Traffic Police Hyderabad : రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. దాదాపు హైదరాబాద్‌లో 80 లక్షలకు పైగా వాహనాలు రహదారులపై రాకపోకలు సాగిస్తుండగా.. వీటిలో ద్విచక్ర వాహనాలు సంఖ్య 57 లక్షలకు పైగానే ఉన్నాయి. ఇక మిగతావి కార్లు, బస్సులు, ఆటోలు ఇతర వాహనాలు. దీనికి తోడు ప్రతి రోజు కొత్త వాహనాలు కూడా రోడ్డెకుతున్నాయి. ఇది హైదరాబాద్ కమిషనరేట్‌లోని ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితి. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ అధికంగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ జామ్‌ల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. చినుకు పడితే చాలు గంటల తరబడి వాహనాలు రోడ్లపై నిలిచిపోవడం సాధారణంగా మారిపోయింది. ఈ పరిణామాల మధ్య పలు కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వర్తించాలంటే.. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు పోలీసుల ప్రణాళిక
అనునిత్యం వాహనాల నుంచి వెలువడే శబ్ద, వాయు కాలుష్యాల కారణంగా ట్రాఫిక్ సిబ్బంది అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. గతంలో ఉన్నతాధికారులు నిర్వహించిన వైద్య శిబిరాల్లో ట్రాఫిక్ సిబ్బంది పలు రకాల రుగ్మతల బారిన పడినట్టు తేలింది. ఆయా సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎండాకాలంలో సిబ్బందికి తాగునీరు, గ్లూకోజ్, కూలింగ్ గ్లాసెస్ వంటివి అందజేస్తున్నారు. ప్రస్తుతం వారికి ఏసీ హెల్మెట్లు అందుబాటులోకి తేవడానికి రంగం సిద్ధమైంది.
తాజాగా హైదరాబాద్ కమిషనరేట్‌లోని నాలుగు జోన్లలో ఏసీ హెల్మెట్ల వినియోగాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. వీటి వినియోగం ఎలా ఉంది, సౌకర్యంగా ఉందా, ఇబ్బందులు ఏమైనా తలెత్తుతున్నాయా తదితర అంశాలపై సిబ్బంది అభిప్రాయాలను ఉన్నతాధికారులు తీసుకోనున్నారు. ఆ తర్వాత హెల్మెట్లను పూర్తిస్థాయిలో అందుబాటులో తేవాలని యోచిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ పోలీసులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
Traffic Police Summer Problems In TS : అధికారుల చర్యలతో.. 2700 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఉపశమనం
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కొత్త రూల్స్.. గీతదాటితే రూ.100, అడ్డుపడితే రూ.1000 కట్టాల్సిందే..