ETV Bharat / state

R Krishnaiah: ఎన్నికలు ఎక్కడ జరిగినా... భాజపాకి వ్యతిరేకంగా పనిచేస్తాం!

author img

By

Published : Oct 23, 2021, 8:47 PM IST

మోదీ ప్రభుత్వం దేశంలోని బీసీలను చిన్నచూపు చూస్తోందని... బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. కుల గణన చేయమని సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. జాతీయ బీసీ కమిషన్ కులగణన చేయాలని కేంద్రాన్ని కోరినప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే కులగణన తప్పనిసరిగా చేయాలని కోరారు. కులగణన చేసేవరకు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి వెళ్లి భాజపాకు వ్యతిరేకంగా పని చేస్తామని తెలిపారు.

R Krishnaiah
R Krishnaiah

94వ ఓబీసీ జాతీయ బీసీ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన సమ్మేళనంలో ఆర్. కృష్ణయ్య

దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ముందుకెళుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. కుల గణన చేయాలని జాతీయ బీసీ కమిషన్ కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే కుల గణన తప్పనిసరిగా చేయాలని కోరారు. కుల గణన కోసం సుప్రీం కోర్టులో మళ్లీ కేసు వేస్తామని తెలిపారు. కుల గణన చేసేంతవరకు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి వెళ్లి భాజపాకు వ్యతిరేకంగా పని చేస్తామని తెలిపారు. ఓబీసీ జాతీయ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో నిర్వహించిన 94వ సమ్మేళనంలో ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్. కృష్ణయ్యతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, పలువురు ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు.

బీసీలు చేపట్టే ప్రతి పోరాటాల్లో మేముంటాం...

బీసీలు చేపట్టే ప్రతి పోరాటాల్లో వామపక్ష పార్టీలు ముందుంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ అన్నారు. దేశ రక్షణ గురించి మాట్లాడే భాజపా ప్రభుత్వమే దేశాన్నీ తాకట్టు పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. కేంద్ర, ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసీ, రక్షణ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకి అనుకూలమైన విధానాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వాల బందీగా ప్రజాస్వామ్యం అనే వ్యాసాలను బుక్‌లాగా రాశారని తెలిపారు. లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్... బలహీన పడడం వల్లే దేశం విచ్చిన్న స్థితికి చేరుకుందని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తెలిపారు.

ఇదీ చదవండి: Rajasingh on ktr: 'స్పందించమంటే విమర్శిస్తారా? మీరు వసూల్ చేస్తున్న రూ.41 మినహాయించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.