ETV Bharat / state

Ts Corona case: మూడు జిల్లాల్లో 0, 24 జిల్లాలో పదిలోపే కేసులు

author img

By

Published : Aug 22, 2021, 8:41 PM IST

Updated : Aug 22, 2021, 9:07 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. రోజుకు 40 వేలకు పైగా వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తుండగా పాజిటివిటీ రేటు 0.58 శాతం కంటే తక్కువగా ఉంటోంది. 98 శాతానికి పైగా రికవరీ రేటు నమోదవుతోంది.

ts corona
కరోనా

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా నిత్యం 300లోపే కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా మహమ్మారి నుంచి కోలుకుంటన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 231 మందికి వైరస్ సోకింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,54,989 మంది కరోనా భారిన పడ్డారు.

453 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,44,747 మందికి చేరింది. తాజాగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు 3,858 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,384 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో 46,987 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇంకా 844 మంది రిపోర్ట్స్​ రావల్సి ఉంది. ఇప్పటివరకు 2,39,42,003 మందికి నిర్ధరణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.58 శాతం, రికవరీ రేటు 98.43 శాతంగా ఉంది. కామారెడ్డి, మెదక్, నాగర్​కర్నూల్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 24 జిల్లాలో పదిలోపే కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్​లో 66 మందికి వైరస్ సోకింది.

తాజాగా వచ్చిన కేసుల్లో ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్​ఎంసీ 66, జగిత్యాల 5, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 2, జోగులాంబ గద్వాల 2, కామారెడ్డి 0, కరీంనగర్ 22, ఖమ్మం 6, కొమురంభీం ఆసిఫాబాద్ 1, మహబూబ్​నగర్ 9, మహబూబాబాద్ 2, మంచిర్యాల 2, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 9, ములుగు 3, నాగర్​కర్నూల్ 0, నల్గొండ 14, నారాయణపేట 1, నిర్మల్ 1, నిజామాబాద్ 5, పెద్దపల్లి 6, రాజన్న సిరిసిల్ల 6, రంగారెడ్డి 19, సంగారెడ్డి 2, సిద్దిపేట 6, సూర్యాపేట 13, వికారాబాద్ 0, వనపర్తి 1, వరంగల్ 9, హనుమకొండ 8, యాదాద్రి భువనగిరి 1 చొప్పున నమోదయ్యాయి.

ఇదీ చూడండి: Rains in Telangana: రాష్ట్రంలో రాగల మూడ్రోజులు.. మోస్తరు వర్షాలు

Last Updated :Aug 22, 2021, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.