ETV Bharat / state

భద్రాచలంలో గోదారమ్మకు శాంతి పూజలు చేసిన సీఎం కేసీఆర్

author img

By

Published : Jul 17, 2022, 12:22 PM IST

kcr Badrachalam tour: ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంలో పర్యటిస్తున్నారు. గోదావరి పరిసరాలు పరిశీలించిన సీఎం.. ముంపు బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అంతకుముందు గోదారమ్మకు శాంతిపూజలు నిర్వహించారు.

భద్రాచలంలో గోదారమ్మకు శాంతి పూజలు చేసిన సీఎం కేసీఆర్
భద్రాచలంలో గోదారమ్మకు శాంతి పూజలు చేసిన సీఎం కేసీఆర్

భద్రాచలంలో గోదారమ్మకు శాంతి పూజలు చేసిన సీఎం కేసీఆర్

kcr Badrachalam tour: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు శనివారం సాయంత్రం.. హన్మకొండలోని కెప్టెన్​ లక్ష్మీకాంతారావు నివాసానికి వచ్చిన సీఎం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉప్పొంగి ప్రవహిస్తోన్న గోదావరి నదికి తొలుత సీఎం.. శాంతి పూజలు నిర్వహించారు. అనంతరం వంతెన పైనుంచి గోదావరి పరిసరాలు సీఎం పరిశీలించారు. గోదావరి కరకట్టను పరిశీలించిన సీఎం కేసీఆర్.. వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత భద్రాచలంలో పునరావాస కేంద్రాన్ని సీఎం పరిశీలించారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో వరద ముంపు వల్ల సంభవించిన నష్టం, చేపడుతున్న సహాయక చర్యలపై.. మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్షిస్తారు. రేపు ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరంలోని.. వరద బాధిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేయనున్నారు.

ముందస్తుగా అరెస్టులు..: మరోవైపు భద్రాచలంలో సీఎం పర్యటన నేపథ్యంలో భాజపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంతో పాటు.. వివిధ పార్టీల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్​ చేశారు.

ఇవీ చూడండి..

'వరద ముంపు బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా'

హడావుడిగా పాక్​లో ల్యాండైన భారత విమానం.. హైదరాబాద్​కు​ వస్తుండగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.