ETV Bharat / sports

టీ20 కెప్టెన్​గా కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్​..

author img

By

Published : Nov 8, 2021, 5:31 AM IST

సెమీస్​ ఆశలు గల్లంతైన వేళ.. నామమాత్ర చివరి లీగ్​ మ్యాచ్​కు టీమ్​ఇండియా సిద్ధమైంది. నమీబియాతో దుబాయ్ మైదానంలో తలపడనుంది.

kohli
కోహ్లీ

టీ20 ప్రపంచకప్​ సెమీస్​ రేసు నుంచి నిష్క్రమించిన టీమ్​ఇండియా.. నమీబియాతో మ్యాచ్​కు సిద్ధమవుతోంది. దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి ఈ పోరు జరగనుంది.

ఆదివారం మ్యాచ్​లో అఫ్గాన్​పై న్యూజిలాండ్​ గెలవడం వల్ల టీమ్​ఇండియా సెమీస్​ ఆశలు గల్లంతయ్యాయి. దీంతో నమీబియాతో మ్యాచ్​ నామమాత్రంగా మారింది.

అలానే ఈ మ్యాచే.. టీ20 కెప్టెన్​గా కోహ్లీకి చివరిది. 2017-21 మధ్య 49 మ్యాచ్​లకు సారథ్యం వహించిన విరాట్.. 29 మ్యాచ్​ల్లో గెలవగా, 16 ఓటమి పాలయ్యాడు. ఓ రెండు టై కాగా, మరో రెండు మ్యాచ్​ల ఫలితం తేలలేదు.

kohli
కోహ్లీ

ప్రస్తుతం 4 మ్యాచుల్లో రెండింటిలో గెలిచిన టీమ్​ఇండియా.. 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. రన్​రేట్​ మెరుగుపరుచుకున్నప్పటికీ, మన జట్టుకు లాభం లేకుండా పోయింది.​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.