ETV Bharat / sports

కెప్టెన్సీలోనూ విరాట్​ భేష్- టెస్టుల్లో రన్ మెషీన్ రికార్డులు తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 4:38 PM IST

Updated : Dec 9, 2023, 6:06 PM IST

Virat Kohli Test Captaincy Record : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరిగ్గా తొమ్మిదేళ్ల కిందట ఇదే రోజు (డిసెంబర్ 9) టెస్టుల్లో కెప్టెన్​గా నియమితుడయ్యాడు. ఇక అప్పటినుంచి టెస్టుల్లో అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు ఈ రన్​ మెషీన్. మరి అవేంటో తెలుసుకుందాం.

virat kohli test captaincy record
virat kohli test captaincy record

Virat Kohli Test Captaincy Record : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాట్​తోనే కాకుండా, నాయకుడిగాను జట్టుకు అనేక విజయాలు కట్టబెట్టాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన టెస్టుల్లో టీమ్ఇండియాను, దాదాపు ఏడేళ్లు విజయపథంలో నడిపించాడు. సరిగ్గా 9 ఏళ్ల కింద ఇదే రోజు (2014 డిసెంబర్ 9)న విరాట్ టీమ్ఇండియా టెస్టు పగ్గాలు చేపట్టాడు. అతడి కెప్టెన్సీలో జట్టు సాధించిన విజయాలేంటో తెలుసుకుందాం.

  • విరాట్ కెప్టెన్సీలో టీమ్ఇండియా 68 మ్యాచ్​లు ఆడింది. అందులో దాదాపు 58.52 శాతం సక్సెస్ రేట్​తో 40 మ్యాచ్​ల్లో విజయం సాధించింది. ఇందులో విదేశాల్లో సాధించిన విజయాలు 16. ఇక 17 మ్యాచ్​ల్లో ఓడగా, 11 మ్యాచ్​లు డ్రా గా ముగించింది. టీమ్ఇండియాకు టెస్టుల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్​గా నిలిచాడు విరాట్. ఈ లిస్ట్​లో విరాట్ తర్వాత మహేంద్రసింగ్ ధోనీ (27 విజయాలు, 60 మ్యాచ్​ల్లో) ఉన్నాడు.
  • ఓవరాల్​గా టెస్టుల్లో తమ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన లిస్ట్​లో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడికంటే ముందు, గ్రాహమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), వాగ్ (41) ఉన్నారు.
  • టెస్టు ఫార్మాట్​లో విరాట్ కెప్టెన్​గా 68 మ్యాచ్​లు ఆడాడు. అందులో 54.80 సగటుతో 5764 పరుగులు చేశాడు. ఇందులో 20 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టెస్టు క్రికెట్​లో 5 వేల పరుగుల మార్క్ అందుకున్న ఏకైక కెప్టెన్ విరాట్ కోహ్లీయే.
  • విరాట్ కెప్టెన్సీలో టీమ్ఇండియా 2017-2021 వరకు వరుసగా ఐదేళ్లపాటు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో నెం.1గా కొనసాగింది.
  • టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన కెప్టెన్ కూడా కోహ్లీనే. విరాట్ 7 సార్లు టెస్టుల్లో 200+ స్కోర్లు నమోదు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 254.
    • Virat Kohli as Captain in Test Cricket:

      Matches - 68
      Innings - 113
      Runs - 5864
      Average - 54.80
      Hundreds - 20
      Fifties - 18
      Double hundreds - 7
      Wins - 40
      ICC Test Mace - 5 times.
      Win % - 58.82%#ViratKohli | @imVkohli pic.twitter.com/4FO4EN5toB

      — 𝗶𝘀𝗵𝗶.🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 (@kohlifangirl178) December 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
    • #OTD in 2014, Virat Kohli wore this blazer and Captained Indian team for the first time in Test Cricket.

      I'll never stop missing Kohli, The Test Captain, those days 🥹❤️pic.twitter.com/5GN6A0yLA8

      — Virat Kohli Fan Club (@Trend_VKohli) December 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
    • Incredible statistics for Virat Kohli as captain in Test cricket.

      Which one is your favorite Test innings while leading the Indian team? pic.twitter.com/6Qy3RM9V3X

      — CricTracker (@Cricketracker) December 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Virat Test Stats : విరాట్ కోహ్లీ కెరీర్​లో 111 మ్యాచ్​లు ఆడాడు. 49.3 సగటుతో 8676 పరుగులు చేశాడు. అందులో 29 సెంచరీలు, 29లు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ 733 రేటింగ్స్​తో ఐసీసీ ర్యాంకింగ్స్​లో 13వ ప్లేస్​లో కొనసాగుతున్నాడు.

  • Incredible statistics for Virat Kohli as captain in Test cricket.

    Which one is your favorite Test innings while leading the Indian team? pic.twitter.com/6Qy3RM9V3X

    — CricTracker (@Cricketracker) December 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విరాట్​ స్థానంలో ఇషాన్! - బీసీసీఐ ప్లాన్ ఇదే!

ఫస్ట్​ ప్లేస్​​పై కోహ్లి కన్ను - వన్డే ర్యాంకింగ్స్​లో రోహిత్ ఏ​ పొజిషన్​లో ఉన్నాడంటే?

Last Updated : Dec 9, 2023, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.