ETV Bharat / sports

విరాట్​ స్థానంలో ఇషాన్! - బీసీసీఐ ప్లాన్ ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 5:44 PM IST

Updated : Dec 7, 2023, 6:26 PM IST

Ishan Kishan Replaces Virat Kohli : 2024 టీ20 వరల్డ్​కప్​నకు బీసీసీఐ సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలో 3వ స్థానంలో విరాట్​ను కాదని, ఇషాన్​ను ఆడించాలని చూస్తోందట.

Ishan Kishan Replaces Virat Kohli
Ishan Kishan Replaces Virat Kohli

Ishan Kishan Replaces Virat Kohli : 2024 టీ20 వరల్డ్​కప్​​ను బీసీసీఐ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ పొట్టి ప్రపంచకప్​నకు మరో ఆరు నెలలే సమయం ఉండడం వల్ల, జట్టు కూర్పుపై మేనేజ్​మెంట్ కసరత్తులు చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్యూచర్​ గురించి అతడితో తాజాగా చర్చలు జరిపిన బీసీసీఐ, రానున్న పొట్టి ప్రపంచకప్​నకు అతడే సారధిగా కొనసాగాలని కోరిందట.

అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం బీసీసీఐ, ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విరాట్ మూడో స్థానంలో బ్యాటింగ్​ చేసేవాడు. అయితే ఇప్పుడు విరాట్​ కాకుండా, ఈ స్థానంలో ప్రత్యర్థులను అటాక్ చేసే మరో బ్యాటర్​ను ఆడించాలని చూస్తుందట బీసీసీఐ. ఈ క్రమంలో మేనేజ్​మెంట్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇషాన్​ 2021 టీ20 వరల్డ్​కప్​లో కూడా ఆడాడు. అతడి కెరీర్​లో ఇప్పటివరకు 32 టీ20 మ్యాచ్​లు ఆడాడు. అందులో 124.37 స్ట్రైక్ రేట్​తో 796 పరుగులు చేశాడు. దీంతో ఇషాన్ 2024 వరల్డ్​కప్​లో మూడో స్థానంలో కీ రోల్​ ప్లే చేస్తాడని మేనేజ్​మెంట్ భావిస్తోందట. అయితే గత ఏడాది కాలంగా విరాట్ టీ20 క్రికెట్ ఆడకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కానీ, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

  • Virat Kohli no longer first-choice for T20 World Cup 2024; Ishan Kishan contender for no.3 spot- Report pic.twitter.com/RM9TValb1Y

    — The Jaipur Dialogues (@JaipurDialogues) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గణాంకాల్లో కోహ్లీయే భేష్.. అయితే బోర్డు మెంబర్లు, సెలక్షన్​ కమిటీ విరాట్​ టీ20 భవిష్యత్​పై, త్వరలోనే అతడితో చర్చించనుందట. ఇక 2024 ఐపీఎల్​లో ప్రదర్శనను బట్టి, వరల్డ్​కప్​లో విరాట్ ఎంపిక ఉంటుందని సమాచారం. కానీ, టీ20 గణాంకాలు చూస్తే విరాట్ అన్ని విధాలుగా టాప్​లో ఉన్నాడు. అతడు టీ20ల్లో అత్యధిక పరుగులు (4008) చేసిన బ్యాటర్​గా టాప్​లో కొనసాగుతున్నాడు.​ ఇక పొట్టి ప్రపంచకప్​ హిస్టరీలోనూ విరాట్ ఇప్పటివరకు 1141 పరుగులు బాదాడు. 2014, 2016 ఎడిషన్​లలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ లెక్కన సెలక్టర్లు విరాట్​ను జట్టులో నుంచి డ్రాప్​ చేసే ఛాన్స్ లేనట్టే! మరి చూడాలి సెలక్టర్లు మొగ్గు ఎవరివైపు ఉండనుందో!

  • Virat Kohli in t20i:
    4008 runs , Avg- 52.74, S.R- 138

    Ishan kishan in t20i:
    796 runs, Avg- 25.68, S.R-124.38🤣

    Virat Kohli in t20 wc:
    1141 runs , avg- 81.50, sr-131.30 with two POT

    Only a clown & nonsense cricket fan can think to replace Virat by kishan🤡#T20WorldCup pic.twitter.com/wD3DZ9YmwV

    — Pallab🇮🇳 (@Pallab200205) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

డ్రెస్సింగ్ రూమ్​లో ఎమోషన్స్​ - ఆ రోజు కోహ్లి, రోహిత్‌ ఏడ్చారు

ఇషాన్ భారీ తప్పిదం - మ్యాచ్​లో టర్నింగ్ పాయింట్ ఇదే!

Last Updated : Dec 7, 2023, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.