ETV Bharat / sports

విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత- గూగుల్ సెర్చ్​ఇంజిన్ 25 ఏళ్ల చరిత్రలో అత్యధికంగా వెతికింది ఇతడినే

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 12:38 PM IST

Updated : Dec 12, 2023, 1:13 PM IST

Virat Kohli Most Searched Cricketer In Google : భారత డాషింగ్ బ్యాటర్ విరాట్​ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. గూగుల్​ సెర్చ్​ ఇంజిన్ చరిత్రలో అత్యధికంగా వెతికిన క్రికెటర్​గా నిలిచాడు. ఆ వివరాలు మీకోసం.

Virat Kohli Most Searched Cricketer In Google
Virat Kohli Most Searched Cricketer In Google

Virat Kohli Most Searched Cricketer In Google : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ 'కింగ్​' మరో అరుదైన ఘనత సాధించాడు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ 25 ఏళ్ల చరిత్రలో అత్యధికంగా వెతికిన క్రికెటర్​గా సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ మేరకు గూగుల్​ రూపొందించిన ఓ వీడియోను ఎక్స్​వేదికగా షేర్​ చేసింది.

గూగుల్‌ సెర్చ్‌ను ఉద్దేశిస్తూ '25 ఏళ్ల క్రితం ఈ ప్రపంచం వెతకడం మొదలు పెట్టింది. ఇక మిగతాదంతా చరిత్రే' అంటూ ఆ వీడియో ప్రారంభమైంది. అందులో గూగుల్​ చరిత్రలో అత్యంత ఎక్కువ మంది వెతికిన మొదటి అడుగుగా నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ చంద్రుడిపై కాలు మోపిన దృశ్యం నిలిచింది. 1980వ దశకం గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది శోధించారట. మరోవైపు అత్యధిక మంది సెర్చె చేసిన అథ్లెట్​గా ఫుటబాల్​ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో పాటు అత్యధిక మంది శోదించిన ఆటగా సాకర్​ నిలిచింది. ఎక్కవ మంది వెతిని జానర్​లో బాలీవుడ్​ ఉంది.

Top 10 most searched things in India in 2023 : అయితే దీంతోరాటు 2023లో అత్యధికంగా సెర్చ్​ చేసిన టాపిక్స్​ జాబితా కూడా ఇదివరకే గూగుల్ రిలీజ్​ చేసింది. అందులో స్పోర్ట్స్​ కేటగిరీలో ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ గురించి ఎక్కువ మంది సెర్చ్​ చేసినట్లు తెలిపింది. ఇంకా క్రీడల్లో అత్యధిక మంది సెర్చ్​ చెసిన విషయాలు ఇవే.

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఐపీఎల్ (India Premier League 2023)
  • క్రికెట్ వరల్డ్ కప్ (ICC ODI World Cup 2023)
  • ఆసియా కప్ (Asia Cup 2023)
  • మహిళల ప్రీమియర్ లీగ్- డబ్ల్యూపీఎల్ (Womens Premier League 2023)
  • ఆసియా క్రీడలు (Asian Games 2023)
  • ఇండియన్ సూపర్ లీగ్ (Indian Super League 2023)
  • పాకిస్థాన్ సూపర్ లీగ్ (Pakistan Super League 2023)
  • ది యాషెస్ (The Ashes 2023)
  • మహిళల క్రికెట్ వరల్డ్ కప్ (Womens World Cup 2023)
  • ఎస్​ఏ20 (South Africa T20 League 2023)

చరిత్ర తిరగరాసిన 'విరాట్' - 50వ సెంచరీతో సచిన్ రికార్డ్​ బ్రేక్

కెప్టెన్సీలోనూ విరాట్​ భేష్- టెస్టుల్లో రన్ మెషీన్ రికార్డులు తెలుసా?

Last Updated : Dec 12, 2023, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.