Shami Arjuna ward : టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ అత్యున్నత క్రీడా పురస్కారం 'అర్జునా అవార్డు' రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భారత క్రీడా మంత్రిత్వ శాఖకు ముందుగా పంపిన లిస్ట్‌లో షమీ పేరు లేదట. కానీ, 2023 వరల్డ్‌కప్‌లో అతడి అద్భుత ప్రదర్శన మేరకు, బీసీసీఐ షమీ పేరు లిస్ట్‌లో చేర్చాలని క్రీడా శాఖకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న' అవార్డుకు పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పేర్లను సిఫార్సు చేశారు. ఇక భారత్‌లో 'ఖేల్‌రత్న' తర్వాత 'అర్జున అవార్డు' రెండో అత్యున్నత క్రీడా పురస్కారంగా ఉన్న విషయం తెలిసిందే.
-
Mohammed Shami awarded by prestigious Arjuna Award. (PTI)
— CricketMAN2 (@ImTanujSingh) December 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- Shami is an Inspiration...!!!! pic.twitter.com/nF9x71n8A0
">Mohammed Shami awarded by prestigious Arjuna Award. (PTI)
— CricketMAN2 (@ImTanujSingh) December 13, 2023
- Shami is an Inspiration...!!!! pic.twitter.com/nF9x71n8A0Mohammed Shami awarded by prestigious Arjuna Award. (PTI)
— CricketMAN2 (@ImTanujSingh) December 13, 2023
- Shami is an Inspiration...!!!! pic.twitter.com/nF9x71n8A0
Shami World Cup 2023 : షమీ ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. అతడు మెగాటోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో సత్తా చాటాడు. అందులో ఏకంగా మూడుసార్లు 5 వికెట్లు, ఒకసారి 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక సెమీస్‌లో న్యూడిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనైతే బీభత్సం సృష్టించాడు షమీ. ఈ మ్యాచ్‌లో షమీ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి, టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండు వన్డేల్లో ఒక మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు షమి. ఇక డిసెంబర్ 26న ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు.
Arjuna Award For Cricketers : ప్రస్తుత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2015లో అర్జునా అవార్డు అందుకోగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2013లోనే ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఇక సచిన్ తెందూల్కర్ (1994), అనిల్ కుంబ్లే (1995), సౌరభ్ గంగూలీ (1997), రాహుల్ ద్రవిడ్ (1998), లక్ష్మణ్ (2001), వీరేంద్ర సేహ్వాగ్ (2002), గౌతమ్ గంభీర్ (2009), జహీర్ ఖాన్ (2011), యువరాజ్ సింగ్ (2012), అంజింక్యా రహానే (2016), ఛెతేశ్వర్ పుజారా (2017), రవీంద్ర జడేజా (2019), శిఖర్ ధావన్ (2021)లో అర్జునా అవార్డులు అందుకున్నారు.
శభాష్ షమీ - ఒక్క పనితో మనసు గెలిచేశావ్!
షమీ @ 7 - కివీస్‌ను దెబ్బకు దెబ్బ కొట్టిన రోహిత్ సేన - ఫైనల్స్‌కు భారత్