ETV Bharat / sports

'టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో లోపించింది అదే..'

author img

By

Published : Jan 29, 2022, 8:20 PM IST

Salman Butt on Team India: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో వికెట్ టేకింగ్ బౌలర్లు కరవయ్యారని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. అయితే.. వెస్టిండీస్​తో సిరీస్ నేపథ్యంలో భారత సెలెక్టర్లు బౌలర్లకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రశంసించాడు.

IND vs SA
భారత్, దక్షిణాఫ్రికా జట్టు

Salman Butt on Team India: టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో వికెట్‌ టేకింగ్‌ బౌలర్లు కరవయ్యారని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ అభిప్రాయపడ్డాడు. రాబోయే వెస్టిండీస్‌ సీరస్‌లకు బౌలింగ్‌ కోసం ఎక్కువ మందిని ఎంపిక చేయడంపై అతడు భారత సెలెక్టర్లను ప్రశంసించాడు. ఇదివరకు చేసిన తప్పులను గుర్తించి ఈసారి బౌలర్లకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ లాంటి ఎడమ చేతి మణికట్టు స్పిన్నర్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడం శుభపరిణామం అని కొనియాడాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియాకు సరైన ఆల్‌రౌండర్‌ లేడని.. దాంతో మధ్య ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్‌ లేకపోయారని పాక్‌ మాజీ కెప్టెన్‌ పేర్కొన్నాడు. దీంతో ఆ పర్యటనలో భారత్‌ ప్రభావం చూపలేకపోయిందని తెలిపాడు. శార్దూల్‌ ఠాకూర్‌ సైతం సరైన పేస్‌ రాబట్టలేకపోయాడని అన్నాడు. ఈసారి కుల్‌దీప్‌కు తోడుగా వాషింగ్టన్‌ సుందర్‌ను ఆఫ్‌ స్పిన్నర్‌గా, రవిబిష్ణోయ్‌ను లెగ్‌ స్పిన్నర్‌గా ఎంపిక చేయడం మంచిదన్నాడు. దీంతో భారత స్పిన్‌ విభాగం బలంగా కనిపిస్తోందని చెప్పాడు. చాహల్‌ కూడా ఉండటంతో జట్టులో నాణ్యమైన వికెట్ టేకర్లు ఉన్నారన్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌తో సిరీస్‌లు గెలవాలంటే మధ్యలో వికెట్లు తీసే బౌలర్లు కావాలని గుర్తించారని సెలెక్టర్లను ఉద్దేశించి సల్మాన్‌ అభిప్రాయపడ్డాడు.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ హూడా, రిషభ్‌ పంత్‌, దీపక్ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవిబిష్ణోయ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌.

టీ20 జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రవిబిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌, యుజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

చరిత్ర సృష్టించిన ఆష్లే బార్టీ.. 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు టైటిల్

ఆసియా గేమ్స్​లో​ భారత చెస్​ టీమ్​ మెంటార్​గా ఆనంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.