ETV Bharat / sports

'మాకు ఇంకో ఛాన్స్ ఉంది'- వరల్డ్​కప్​పై రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 1:31 PM IST

Updated : Jan 19, 2024, 2:25 PM IST

Rohit Sharma T20 World Cup 2024: గతేడాది వరల్డ్​కప్ ఓడిన తమకు 2024 టీ20 ప్రపంచకప్ ముఖ్యమని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ అన్నాడు.

Rohit Sharma About T20 World Cup 2024
Rohit Sharma About T20 World Cup 2024

Rohit Sharma T20 World Cup 2024: 2023 వరల్డ్​కప్ ఓటమి తర్వాత టీమ్ఇండియా 2024 పొట్టి ప్రపంచకప్​ దక్కించుకోవడానికి కసిగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్​గా అఫ్గానిస్థాన్​తో ఆడిన మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను భారత్ క్లీన్​ స్వీప్ చేసింది. అయితే వన్డే వరల్డ్​కప్ ఓడిన టీమ్ఇండియాకు పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్​ ఓ మంచి అవకాశమని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

'వన్డే వరల్డ్​కప్ ఓటమి గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. కానీ, నా దృష్టిలో 50 ఓవర్ల ప్రపంచకప్ క్రికెట్​లో అతిపెద్ద టోర్నీ. అలా అని టీ20 వరల్డ్​కప్, టెస్టు ఛాంపియన్‌షిప్‌ కీలకమైనవి కాదని నేను అనట్లేదు. నేను 50 ఓవర్ల ప్రపంచకప్ చూస్తూ పెరిగా. అలాంటిది ఈ టోర్నీ భారత్​లో జరగడం అనేది పెద్ద విషయం. ఫైనల్​కు చేరుకున్నా దురదృష్టవశాత్తు కప్ గెలవలేకపోయాం. మాతోపాటు ఫ్యాన్స్ అందరూ ఎంతో బాధపడ్డారు. కానీ, మాకు టీ20 వరల్డ్​కప్​ రూపంలో ఇంకో అవకాశం ఉంది. ఈ టోర్నీలో కచ్చితంగా గెలుస్తామనే ధీమాతోనే బరిలోకి దిగుతాం' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

అఫ్గాన్​తో ఆఖరి మ్యాచ్​లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అయితే 'విరాట్ ప్రతి మ్యాచ్​లోనూ పరుగులు చేయాలనే కసితో బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్​లోనూ అలాగే కసితో ఉన్నాడు. కానీ డకౌట్​ అయ్యాడు. కానీ, అతడికి డకౌట్​ అనే పదం అస్సలు నచ్చదు. అలా ఔటైనప్పటికీ విరాట్ మైండ్ డైవర్ట్ కాదు. సెకండ్ ఇన్నింగ్స్​లో అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. వికెట్ కీపర్ సంజూ శాంసన్ కూడా ఇలాగే వికెట్ పారేసుకున్నాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఇలా జరిగింది' అని రోహిత్ అన్నాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, టీమ్ఇండియా సూపర్​ ఓవర్​లో 10 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 212 పరుగులు చేయగా, ఛేదనలో అఫ్గాన్​ కూడా 212 పరుగులకే ఇన్నింగ్స్​ ముగించింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే సూపర్​ ఓవర్​ కూడా డ్రా అవ్వడం వల్ల, రెండో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. రెండో సూపర్ ఓవర్​లో భారత్ 11 పరుగులు చేయగా, అఫ్గాన్ 1 పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి మ్యాచ్​లో ఓటమి మూటగట్టుకుంది.​

సూపర్​ ఓవర్​లో రోహిత్ 'స్మార్ట్​నెస్'- రూల్స్ ప్రకారం కరెక్టే!- కోచ్​కు తెలియాలి కదా!

'ఆ టోర్నీలో ఆడేదెవరో నాకు తెలుసు- మా ఫైనల్ టార్గెట్ అదే!'

Last Updated : Jan 19, 2024, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.