ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(Ganguly) బయోపిక్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ధోనీ, మహ్మద్ అజారుద్దీన్, సచిన్ తెందుల్కర్ జీవిత చరిత్రలు వెండితెరపై ప్రేక్షకులను కనువిందు చేశాయి. త్వరలోనే 1983 ప్రపంచకప్ నేపథ్యంలో రూపొందిన కపిల్‌దేవ్ జీవితకథ '83' సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే దాదా బయోపిక్‌ను తెరకెక్కించేందుకు కొద్ది కాలంగా బాలీవుడ్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇనాళ్లు ఈ ప్రాజెక్ట్‌కు ససేమీరా అన్న దాదా.. తాజాగా అంగీకరించాడు.
"అవును నా బయోపిక్‌ను తెరకెక్కించేందుకు అంగీకరించాను. హిందీలో ఈ సినిమాను రూపొందించనున్నారు. అయితే ఇప్పుడే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను చెప్పలేను. కొంత సమయం పడుతుంది" అని గంగూలీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
రణ్‌బీర్‌కపూర్ రేసులో
ప్రస్తుతం దాదా బయోపిక్కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట!. రూ200-250 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది. ప్రధాన పాత్ర పోషించే విషయమై నిర్మాణ సంస్థ, గంగూలీ పలుసార్లు చర్చించుకుని రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)ను తీసుకోవాలని నిర్ణయించారట!. అంతకుముందు హృతిక్‌రోషన్ ఈ బయోపిక్‌లో నటిస్తారని వార్తలు వచ్చాయి.
2002 నుంచి 2005 వరకు భారత జట్టుకు సారథ్యం వహించాడు గంగూలీ. ఎన్నో విజయాలు అందుకుని 2008లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నాడు దాదా.
ఇదీ చూడండి: గంగూలీ బయోపిక్‌లో హృతిక్.. కానీ ఒక్క షరతు