ETV Bharat / sports

INDvsENG: మూడో టెస్టుకు జడ్డూను పక్కనపెడతారా?

author img

By

Published : Aug 22, 2021, 3:25 PM IST

ఇంగ్లాండ్​లో భీకర ఫామ్​లో ఉంది టీమ్​ఇండియా. అయితే తొలి రెండు టెస్టుల్లో అంతగా ఆకట్టుకోని ఆల్​రౌండర్​ జడేజాను మాత్రం మూడో టెస్టుకు పక్కనే పెట్టే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే?

Ravindra Jadeja
అశ్విన్

టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లో అద్భుత ప్రదర్శనతో కొనసాగుతోంది. సీమ్‌కు అనుకూలించే పిచ్‌లపై నాలుగు-ఒకటి ఫార్ములాతో అదరగొడుతోంది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో తొలి టెస్టులో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా ఆధిపత్యం చలాయించింది. అయితే, వర్షం కారణంగా చివరిరోజు ఆట రద్దవ్వడంతో ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. అదే ఫార్ములాతో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులోనూ భారత్‌ మెరుగైన ప్రదర్శన చేసింది. దాంతో అక్కడ విజయం సాధించి సిరీస్‌లో ముందంజలో నిలిచింది. ఈ క్రమంలోనే రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇలాగే విజయాలు సాధించి 13 ఏళ్ల తర్వాత ఇంగ్లిష్‌ గడ్డపై సిరీస్‌ గెలవాలని చూస్తోంది.

కాగా, మూడో టెస్టులో టీమ్‌ఇండియా స్పిన్‌ బౌలింగ్‌ విభాగంలో సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తొలి రెండు మ్యాచ్‌ల్లో జడేజాను ఆడించినా.. ఆశించిన మేర రాణించలేకపోయాడు. తొలి టెస్టులో మొత్తం 16 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయిన అతడు తర్వాతి మ్యాచ్‌లోనూ అలాంటి ప్రదర్శనే పునరావృతం చేశాడు. ఈసారి మొత్తం 28 ఓవర్లు వేసినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు రెండో టెస్టులోనే తుది జట్టులో చోటు దక్కే అవకాశం వచ్చినా మ్యాచ్‌ ప్రారంభమయ్యే ముందు వర్షం కురవడంతో తనని తీసుకోలేదని తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో అశ్విన్‌ వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా మూడో టెస్టులో జడేజాను పక్కనపెట్టి అశ్విన్‌ను ఎంపిక చేసే వీలుంది.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​పై బ్యాట్​ ఝుళిపించిన భారత బ్యాట్స్​మెన్ వీళ్లే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.