ETV Bharat / sports

ఆ పరిస్థితుల్లో కోహ్లీ వ్యవహరించిన తీరు అద్భుతం: ద్రవిడ్

author img

By

Published : Jan 2, 2022, 5:50 PM IST

Rahul Dravid on Kohli: టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీపై పలు వ్యాఖ్యలు చేశాడు హెడ్​ కోచ్ రాహుల్ ద్రవిడ్. కెప్టెన్సీ అంశంపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నా.. కోహ్లీ వ్యవహరించిన తీరు హర్షణీయమని అన్నాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు ద్రవిడ్.

rahul dravid, kohli
రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ

Rahul Dravid on Kohli: జోహెనస్​బర్గ్​ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు సిద్ధమవుతోంది టీమ్​ఇండియా. ఈ నేపథ్యంలో భారత జట్టు టెస్టు సారథి విరాట్ కోహ్లీపై పలు వ్యాఖ్యలు చేశాడు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్. 20 రోజులకు పైగా కోహ్లీ కెప్టెన్సీ అంశంపై చర్చలు జరుగుతున్నా.. అతడు అద్భుతంగా వ్యవహరించాడని అన్నాడు.

"గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అంశంపై చర్చ జరుగుతోంది. అయినా అతడు బాగా రాణించాడు. జట్టు సభ్యులతో మునుపటిలానే ఉన్నాడు. ఇన్ని చర్చల నడుమ ఆటకోసం తను సిద్ధమైన విధానం అద్భుతం."

--రాహుల్ ద్రవిడ్, టీమ్​ హెడ్ కోచ్.

దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ ఇప్పటివరకూ మీడియా ముందు హాజరుకాలేదు. దీనిపై స్పందించిన ద్రవిడ్.. కోహ్లీ అలా చేయడానికి ప్రత్యేక కారణమేమీ లేదని తెలిపాడు. బహుశా కోహ్లీ తన 100వ టెస్టు సందర్భంగా మీడియా ముందుకు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.

దక్షిణాఫ్రికా 3వ టెస్టు కోహ్లీ 100వ టెస్టు కానుంది. ఈ మ్యాచ్ కేప్​ టౌన్ వేదికగా జనవరి 11న ప్రారంభంకానుంది.

ఫామ్​లోకి వస్తే అంతే..

సౌతాఫ్రికాతో మరో రెండు టెస్టులు ఆడనుంది టీమ్​ఇండియా. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ ఫామ్​లోకి వస్తే.. భారీగా పరుగులు చేయగలడని అన్నాడు రాహుల్ ద్రవిడ్. గత రెండేళ్లుగా విరాట్​ సెంచరీ చేయకుండానే వెనుదిరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఇదీ చదవండి:

IND vs SA Virat Kohli: మరో టెస్టు గెలిస్తే.. కోహ్లీ ఖాతాలో 3 రికార్డులు

'దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. ప్లాన్ సిద్ధం చేశా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.