ETV Bharat / sports

'అప్పుడు చాలా కష్టంగా అనిపించింది.. ఆ ఇద్దరితోనే మాట్లాడేవాడ్ని'

author img

By

Published : Apr 5, 2022, 10:56 AM IST

Pant Low Phase: రిషభ్​ పంత్​.. ప్రస్తుతం టీమ్​ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలో క్రికెట్​ ఆడుతున్న అతికొంతమంది ప్లేయర్లలో ఒకడు. నిలకడగా రాణిస్తూ జట్టులో చోటు సుస్థిరం చేసుకున్నాడు. అయితే.. తన కెరీర్​ సంధి దశలో పరిస్థితుల గురించి ఇటీవల ఆసక్తికర విషయాలు వెల్లడించాడు పంత్​.

Pant opens up on 'low phase' of his life
Pant opens up on 'low phase' of his life

Pant Low Phase: రిషభ్​ పంత్​.. చిన్న వయసులోనే తన క్రికెట్​ కెరీర్​లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఒక్కసారిగా స్టార్​ ముద్ర, కొద్దిరోజులకే కిందికి.. అద్భుత ప్రదర్శనతో మళ్లీ తిరుగులేని స్థాయికి.. ఇలా పంత్​ ఎన్నో సంధి దశలను ఎదుర్కొన్నాడు. 19 ఏళ్ల వయసుకే 2017లో టీమ్​ఇండియాకు ఆడినా.. మరుసటి ఏడాది టెస్టు అరంగేట్రంతోనే తనకు గుర్తింపు వచ్చింది. ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా పర్యటనల్లో సెంచరీలు చేసి.. ప్రపంచ క్రికెట్​కు తన రాక గురించి గొప్ప సంకేతాలు ఇచ్చాడు. ఆ తర్వాత.. విజయ్​ శంకర్​కు గాయంతో పంత్​ వరల్డ్​కప్​ జట్టులో చోటు సంపాదించాడు. ఎంత వేగంగా ఎదిగాడో అదే స్థాయిలో కిందికి పడిపోయాడు. 2019 ద్వితీయార్ధంలో పరిమిత ఓవర్ల జట్టునుంచి పంత్​ ఉద్వాసనకు గురయ్యాడు. రోజులు, నెలలుకాదు.. పునరాగమనం కోసం దాదాపు సంవత్సరం పాటు నిరీక్షించాడు.

ఆసీస్​పై భారత్​ 36 పరుగులకే ఆలౌటైన అడిలైడ్​ టెస్టులో వికెట్​ కీపర్​​ సాహాకు గాయమైంది. వెంటనే పంత్​కు ఛాన్స్​ వచ్చింది. ఆ అవకాశాలను రెండుచేతులా అందిపుచ్చుకున్నాడు. ఇక వెనుదిరిగిచూసుకునే అవకాశమే రాలేదు. మెల్​బోర్న్​, బ్రిస్బేన్ ​(గబ్బా) టెస్టుల్లో భారత్​ గెలిచింది. గబ్బా టెస్టులో భారత్​ విజయంలో పంత్​దే కీలకపాత్ర. సిడ్నీ టెస్టులోనూ పంత్​ వీరోచిత ప్రదర్శనతోనే డ్రా అయింది. ఇప్పుడు.. టీమ్​ఇండియాకు అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న అతికొద్దిమందిలో పంత్​ ఒకడు. పరిస్థితులకు అతీతంగా రాణిస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 24 ఏళ్లకే జట్టులో చోటు సుస్థిరం చేసుకున్నా.. ఒకప్పటి కెరీర్​ క్లిష్ట స్థితిని మర్చిపోలేకపోతున్నాడు పంత్​. ఇటీవల ఓ మేగజైన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి విషయాల గురించి వెల్లడించాడు.

''అప్పుడు నాకు చాలా కష్టసమయం నడిచింది. అందరితో దూరంగా ఉన్నా. ఎవరిదగ్గరికైనా వెళ్లాలంటే.. చాలా ఇబ్బందిగా అనిపించేది. కేవలం నాపైనే నమ్మకం ఉంచా. ప్రపంచానికి నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నా. నా అవకాశం కోసం ఎదురుచూశా. రోహిత్​, ధోనీలతో మాత్రమే కొద్దిగా మాట్లాడేవాడిని. ఎక్కువగా నన్ను నేను నమ్ముకుంటూ ముందుకుసాగా.''

- రిషభ్​ పంత్​, టీమ్​ఇండియా క్రికెటర్​

పంత్​ పరిమిత ఓవర్ల క్రికెట్​ కంటే.. టెస్టుల్లోనే బాగా రాణించాడు. 30 టెస్టుల్లో 40.85 సగటుతో 1920 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. ఇందులో ఇంగ్లాండ్​పై 100 బంతుల్లో హాఫ్​సెంచరీ చేస్తే.. ఇటీవల బెంగళూరులో శ్రీలంకపై 28 బంతుల్లోనే చేశాడు. 24 వన్డేల్లో 32.5 సగటుతో 715 స్కోరు చేశాడు. ఇందులో 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. 43 టీ20ల్లో 24.39 సగటుతో 683 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్​సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు పంత్​.

ఇవీ చూడండి: 'ధోనీ ధాటిగా ఆడలేదు.. అక్కడే చెన్నై ఆగిపోయింది'

20 ఏళ్లకే ప్రపంచ నెం.1.. తొలి క్రీడాకారిణిగా రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.