ETV Bharat / sports

20 ఏళ్లకే ప్రపంచ నెం.1.. తొలి క్రీడాకారిణిగా రికార్డు!

author img

By

Published : Apr 4, 2022, 10:48 PM IST

Iga Swiatek: డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్​లో అగ్రస్థానానికి చేరుకుంది పోలాండ్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్. దీంతో ఆ దేశం తరఫున ప్రపంచ నెం.1గా నిలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.

Iga Swiatek
wta rankings

Iga Swiatek: డబ్ల్యూటీఏ (ఉమెన్స్​ టెన్నిస్ అసోషియేషన్) మహిళల సింగిల్స్​ ర్యాంకింగ్స్​లో సోమవారం అగ్రస్థానానికి చేరుకుంది ఇగా స్వియాటెక్. దీంతో ప్రపంచ నెం.1 స్థానానికి చేరుకున్న తొలి పోలాండ్​ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. మూడు సార్లు గ్రాండ్​స్లామ్​ విజేత, ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీ 25 ఏళ్లకే అనూహ్యంగా ఇటీవలే రిటైర్మెంట్​ ప్రకటించగా, ఆ స్థానంలోకి వచ్చి చేరింది స్వియాటెక్. రెండేళ్లకు పైగా ప్రపంచ నెం.1గా కొనసాగింది బార్టీ.

నవోమీ ఒసాకపై గెలిచి శనివారం మియామీ ఓపెన్​ టైటిల్​ను కైవసం చేసుకుంది స్వియాటెక్. దీంతో వరుసగా 17 మ్యాచ్​ల్లో విజయాలను నమోదు చేసింది. గతవారం ఇండియన్​ వెల్స్​, ఫిబ్రవరిలో కతార్​ ఓపెన్​లను సైతం గెలిచింది స్వియాటెక్. తద్వారా.. ఒక సంవత్సరంలో తొలి మూడు డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్స్​ను గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది.

ఇదీ చూడండి: ప్రపంచ ఛాంపియన్​కు షాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.