ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో టెస్టుకు రోహిత్​ దూరం.. టీమ్​ ఇండియా కొత్త కెప్టెన్​గా పేసర్​

author img

By

Published : Jun 30, 2022, 6:29 PM IST

Updated : Jun 30, 2022, 7:15 PM IST

Jasprit Bumrah to lead Team India in the fifth Test Match against England
Jasprit Bumrah to lead Team India in the fifth Test Match against England

18:24 June 30

ఇంగ్లాండ్​తో టెస్టుకు రోహిత్​ దూరం.. టీమ్​ ఇండియా కొత్త కెప్టెన్​గా పేసర్​

Jasprit Bumrah Captain: ఇంగ్లాండ్​తో చివరిదైన ఐదో టెస్టుకు కెప్టెన్​ రోహిత్​ శర్మ దూరం అయ్యాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. స్టార్​ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా తాత్కాలిక కెప్టెన్​గా వ్యవహరించనున్నాడని స్పష్టం చేసింది. వికెట్​ కీపర్​ బ్యాటర్​ రిషభ్​ పంత్​ వైస్​- కెప్టెన్​గా నియమితుడయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ట్వీట్ చేసింది. దీంతో కపిల్‌ దేవ్‌ (1987) తర్వాత టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్న ఫాస్ట్‌ బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కుతాడు. టీమిండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్‌ బర్మింగ్​ హామ్​ వేదికగా శుక్రవారం నుంచి జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ఓపెనర్​ రోహిత్​ అయిన నేపథ్యంలో.. టీమ్​ ఇండియా తుది కూర్పుపై స్పష్టత రావాల్సి ఉంది. అతడి స్థానంలో ఓపెనర్​గా, శుభ్​మన్​ గిల్​కు జోడీగా పుజారా లేదా విహారిని ఆడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

జట్టు అంచనా: శుభ్​మన్​ గిల్​, హనుమ విహారి, పుజారా, విరాట్​ కోహ్లీ, రిషభ్​ పంత్​, రవీంద్ర జడేజా, రవిచంద్రన్​ అశ్విన్​, మహ్మద్​ షమి, జస్​ప్రీత్​ బుమ్రా, మహ్మద్​ సిరాజ్​.

మరోవైపు.. ఒకరోజు ముందే ఇంగ్లాండ్​ తమ తుది జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​లో చివరి మ్యాచ్​ ఆడని.. జేమ్స్​ అండర్సన్​ను తిరిగి టీంలోకి తీసుకున్నారు. కరోనా కారణంగా వికెట్​ కీపర్​, బ్యాటర్​ బెన్​ ఫోక్స్ ఈ మ్యాచ్​కు దూరమయ్యాడు. అతడి స్థానంలో సామ్​ బిల్లింగ్స్​ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్లుగా అలెక్స్​ లీస్​, జాక్​ క్రాలీ ఉన్నారు. మిడిలార్డర్​లో ఓలీ పోప్​, జో రూట్​, బెయిర్​ స్టో, బెన్​ స్టోక్స్​తో జట్టు పటిష్ఠంగా ఉంది. పేస్​ దళానికి అండర్సన్​ నేతృత్వం వహిస్తుండగా.. అతడికి సహకారం అందించేందుకు బ్రాడ్​, పాట్స్, స్టోక్స్​.. స్పిన్నర్​ జాక్​ లీచ్​ ఉండనే ఉన్నారు.
ఇంగ్లాండ్​ జట్టు: అలెక్స్​ లీస్​, జాక్​ క్రాలీ, ఓలీ పోప్​, జో రూట్​, జానీ బెయిర్​స్టో, బెన్​ స్టోక్స్​(కెప్టెన్​), సామ్​ బిల్లింగ్స్​(వికెట్​ కీపర్​), మాథ్యూ పాట్స్​, స్టువర్ట్​ బ్రాడ్​, జాక్​ లీచ్​, జేమ్స్​ అండర్సన్​.

గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు టెస్టులు పూర్తయ్యేసరికి భారత్‌ ఒక మ్యాచ్‌ డ్రా చేసుకొని 2-1 ఆధిక్యంలో నిలిచింది. అయితే, గతంలో కరోనా కారణంగా వాయిదాపడిన ఐదో టెస్టును ఇప్పుడు తిరిగి నిర్వహిస్తున్నారు. ఇందులో ఇంగ్లాండ్​ గెలిస్తే సిరీస్​ సమం అవుతుంది. టీమ్​ ఇండియా గెలిచినా, డ్రా చేసుకున్నా చారిత్రక టెస్టు సిరీస్​ మన సొంతం అవుతుంది.

ఇవీ చూడండి: కోహ్లీ vs అండర్సన్‌.. ఇదే చివరి పోరు! ఇప్పటివరకు పైచేయి అతడిదేనా?

స్టార్​ ఓపెనర్​ సర్జరీ సక్సెస్​.. త్వరలోనే టీమ్​ ఇండియాలోకి రీ ఎంట్రీ!

Last Updated : Jun 30, 2022, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.