ETV Bharat / sports

ఉన్ముక్త్​.. రెండేళ్ల నుంచి ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేదట!

author img

By

Published : Aug 22, 2021, 11:23 AM IST

28 ఏళ్లకే క్రికెట్​కు వీడ్కోలు పలికి అభిమానులను ఆశ్చర్యపరిచిన ఆటగాడు ఉన్ముక్త్​ చంద్​.. రిటైర్మైంట్​ వెనక గల కారణాలు వెల్లడించాడు. గత రెండేళ్ల నుంచి అవకాశాలు లేక మానసిక క్షోభ అనుభవించానని తెలిపాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం యూఎస్​ లీగ్​లో ఆడుతున్నాడు ఉన్ముక్త్​.

Unmukt chand
ఉన్ముక్త్ చంద్

ఉన్ముక్త్​ చంద్.. భారత అండర్​-19 జట్టుకు ప్రపంచకప్​ అందించిన కెప్టెన్. సారథిగా, బ్యాట్స్​మన్​గా తనను తాను నిరూపించుకున్నాడు. మరి ఇంకేముంది. భారత జట్టులో చోటే తరువాయి. కానీ, ఈ యువ ఆటగాడికి ఇంతవరకు బీసీసీఐ నుంచి పిలుపు రాలేదు. అటు దేశవాళీల్లోనూ అవకాశాలు రాక విసిగిపోయాడు. దీంతో విదేశీ లీగ్​లే సరైనవని భారత్​లో ఆటకు వీడ్కోలు ప్రకటించాడు.

"గత రెండేళ్లు చాలా కష్టంగా గడిచింది. చివరి సీజన్​లో దిల్లీ జట్టు తరఫున ఒక్క మ్యాచ్​ కూడా ఆడే అవకాశం రాలేదు. టీమ్​లో సహచరులు కనీసం నన్ను గుర్తించలేదు. వారంతా మైదానంలో ఆడుతుంటే.. నేను డగౌట్​కు పరిమితమవ్వాల్సి వచ్చింది. ఒంటరిగా పెవిలియన్​లో కూర్చొవడం మానసిక క్షోభలా అనిపించింది. ఇది మెంటల్​గా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. రానురాను ఇక అవకాశాలు వస్తాయో లేదో అని రిటైర్మెంట్​ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది"

-ఉన్ముక్త్ చంద్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.

విదేశీ లీగ్​ల కోసం యూఎస్​ను ఎంచుకోవడంపై ఉన్ముక్త్​ స్పందించాడు. అక్కడి పరిస్థితులు అన్ని అంచనా వేశాకే ఓ నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నాడు.​ 'మూణ్నెళ్ల క్రితం అమెరికా వెళ్లినప్పుడు అక్కడి క్రికెట్​ను దగ్గర నుంచి చూశాను. పలు మ్యాచ్​లు ఆడాను. అక్కడి ఆటపై ఓ స్పష్టత వచ్చాక ఆడాలనుకున్నా. ఇప్పటికే కోరె అండర్సన్, స్మిత్ పటేల్, హర్మీత్ సింగ్ వంటి ప్లేయర్లు యూఎస్​ లీగ్​లలో ఆడుతున్నారు' అని పేర్కొన్నాడు.

గతంలో ఆటలో అవకాశాలు రానప్పుడు చాలా కష్టంగా ఉండేదని ఉన్ముక్త్​ తెలిపాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఇబ్బంది పడేవాడినని పేర్కొన్నాడు. క్రికెట్​కు వీడ్కోలు ప్రకటించాక కాస్త ఉపశమనంగా అనిపించిందని తెలిపాడు. ఇప్పుడు తాను చేయాల్సిన పనిపై స్పష్టత వచ్చిందని పేర్కొన్నాడు.

ఇవీ చదవండి:

'అండర్-19 ప్రపంచకప్​ గెలిచినా అవకాశాలు రాలేదు'

28 ఏళ్లకే వరల్డ్​కప్​ విన్నర్ రిటైర్మెంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.