ETV Bharat / sports

ఎవరు ఏమనుకున్నా సరే.. అతడే నంబర్ 1 ఆల్​రౌండర్!

author img

By

Published : Sep 18, 2022, 6:39 PM IST

హార్దిక్ పాండ్యపై రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హార్దిక్‌ పాండ్యనే నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌ అని స్పష్టం చేశాడు. ఓ క్రీడా షోలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Ravi Shastri
Hardik Pandya is number on all rounder says team india ex coach ravi Ravi Shastri

ఆస్ట్రేలియాలో జరిగిబోయే టీ20 వరల్డ్​ కప్​ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో స్టార్​ ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యకు కూడా చోటు లభించింది. ఐపీఎల్​లోనూ అద్భత ప్రదర్శన కనబరిచి.. గుజరాత్​కు జట్టు టైటిల్ గెలవడంలో పాండ్య కీలక పాత్ర పోషించాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్​లోనూ రాణించాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత బ్యాటింగ్, బౌలింగ్​ విభాగాల్లో మంచి ప్రదర్శన చేశాడు. ఇలాంటి ఆల్​ రౌండర్​లు ఉండటం వరల్డ్​ కప్​లో జట్టుకు అనుకూలిస్తుంది. అయితే హార్దిక్ పాండ్యపై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"హార్దిక్​ పాండ్య నంబర్​ 1 ఆల్​ రౌండర్​ అని నేను ఇదివరకే చెప్పాను, ఇన్​స్టాగ్రామ్​ పోస్టు ద్వారా తెలియజేశాను. టీ20 ఫార్మాట్‌లో హార్దికే నంబర్‌వన్‌ అని మరోసారి చెబుతున్నా. ప్రతి ఒక్కరూ తమదైన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉంది. బయటి వ్యక్తులు వారికి ఏం అనిపిస్తే అది అంటారు. అది వారిష్టం. నా అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉంది. అదే ట్విట్టర్​లో కూడా తెలియజేశాను" అని ఓ ఛానల్ నిర్వహించిన క్రీడా షోలో రవిశాస్త్రి తెలిపారు.

ఇవీ చదవండి: 'సిరాజ్​ ఏం పాపం చేశాడు'.. బీసీసీఐపై నెటిజన్లు ఫుల్​ ఫైర్​!

ఓపెనర్​గా కోహ్లీ కంటే అతడికే సత్తా ఎక్కువ: గౌతమ్​ గంభీర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.