ETV Bharat / sports

మరోసారి పెళ్లి చేసుకున్న మ్యాక్స్​వెల్​ జంట.. ఈ సారి ఆ సంప్రదాయంలో!

author img

By

Published : Mar 28, 2022, 5:52 PM IST

Glenn Maxwell Hindu Marriage: మార్చి 18న క్రిస్టియన్​ పద్ధతిలో తన ప్రేయసి వినీరామన్​ను వివాహాం చేసుకున్న ఆస్ట్రేలియన్​ క్రికెటర్​ మ్యాక్స్​వెల్​..ఇప్పుడు మరోసారి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

maxwell hindu marriage
maxwell hindu marriage

Glenn Maxwell Hindu Marriage: కరోనా కారణంగా పలుసార్లు తన వివాహాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్‌.. ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కాడు. తన ప్రేయసి వినీ రామన్‌ను మార్చి 18న పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు మరోసారి భారతీయ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం ఆదివారం(మార్చి 27) జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

maxwell hindu marriage
మ్యాక్స్​వెల్​, వినీ రామన్​

ఆ వీడియోలో.. వినీ రామన్​ సంప్రదాయ పద్ధతిలో పట్టుచీర కట్టుకొని కనిపిస్తోంది. అదే సమయంలో మ్యాక్స్‌వెల్ షేర్వాణీలో ఉన్నాడు. బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్, వారి దుస్తులను చూస్తుంటే ఈ వివాహం తమిళ బ్రాహ్మణ పద్ధతిలో జరిగినట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన వినీ రామన్‌ ఆస్ట్రేలియాలో మెడిసిన్‌ పూర్తి చేసి అక్కడే ప్రాక్టీస్ చేస్తోంది 2013లో ఓ ఈవెంట్‌లో ఆమెను చూసిన మాక్స్‌వెల్‌ తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. అప్పటి నుంచి వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఫామ్‌ కోల్పోయి జట్టుకు దూరమైన సమయంలో వినీ రామన్‌ అండగా నిలిచిందని.. మానసిక ఒత్తిడి నుంచి కోలుకుని.. తిరిగి ఫామ్‌ అందుకోవడంలో ఆమె పాత్ర కీలకమని మాక్స్‌వెల్ పలు సందర్భాల్లో పేర్కొన్నాడు.

maxwell hindu marriage
మ్యాక్స్​వెల్​, వినీ రామన్​

కాగా, మ్యాక్స్​వెల్​ తన పెళ్లి కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. పాకిస్థాన్​లో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరంభ మ్యాచులకు దూరంగా ఉంటున్నట్లు ఇది వరకే ప్రకటించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం అతడు ఏప్రిల్ 5 తర్వాత ఆర్సీబీ జట్టులోకి చేరుతాడు.

ఇదీ చదవండి: 'అది మాకు కలిసొచ్చే అంశం.. ఐపీఎల్​ ట్రోఫీ మాదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.