ETV Bharat / sports

హెచ్​సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్​కు పితృవియోగం

author img

By

Published : Oct 18, 2022, 9:42 PM IST

Updated : Oct 18, 2022, 10:01 PM IST

azharuddin father passed away
హెచ్​సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్​కు పితృవియోగం

21:38 October 18

అజారుద్దీన్ తండ్రి కన్నుమూత

భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్​, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మహమ్మద్‌ యూసుఫ్‌ కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన... ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురై కొన్ని రోజుల నుంచి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నేడు(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంలో అజారుద్దీన్​ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. యూసుఫ్​ అంత్యక్రియలు రేపు(బుధవారం) బంజారాహిల్స్​లో నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: T20 worldcup: ఎక్కువ సార్లు డకౌట్ అయిన ప్లేయర్స్​ ఎవరంటే?

Last Updated :Oct 18, 2022, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.