ETV Bharat / sports

Dunith Wellalage Asia Cup 2023 : భారత్​ను హడలెత్తించిన కుర్ర స్పిన్నర్‌.. అసలెవరీ దునిత్​ ?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 6:48 AM IST

Dunith Wellalage Asia Cup 2023 : దునిత్‌ వెల్లలాగె.. టీమ్‌ఇండియా అంత సులువుగా మరిచిపోలేని ఓ పేరు. అంతర్జాతీయ అరంగేట్రం చేసి ఏడాదే అయినప్పటికీ 20 ఏళ్ల ఈ శ్రీలంక యువ స్పిన్నర్‌ తన బౌలింగ్​ స్కిల్స్​తో రోహిత్​ సేనను హడలెత్తించాడు. మ్యాచ్​ భారత్​ గెలిచనప్పటికీ.. స్టార్ మాత్రం తానై నిలిచాడు.ఇంతకీ ఈ దునిత్​ ఎవరంటే ?

Dunith Wellalage Asia Cup 2023
Dunith Wellalage Asia Cup 2023

Dunith Wellalage Asia Cup 2023 : భారత్​-శ్రీలంక మధ్య పోరు జరుగుతున్న వేళ ఓ 20 ఏళ్ల ఈ శ్రీలంక యువ స్పిన్నర్‌.. భారత బ్యాటర్లను మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. అతని ధాటికి టీమ్‌ఇండియా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో ఈ యంగ్​ ప్లేయర్​ ఓవర్​నైట్​ స్టార్​ అయిపోయాడు. అతనే శ్రీ లంకకు చెందిన దునిత్‌ వెల్లలాగె. మైదానంలో అడుగుపెట్టినప్పటి నుంచి భారత బ్యాటర్లను హడలెత్తించిన దునిత్​.. మొత్తంగా 10 ఓవర్లలో 40 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌కు స్వర్గధామంలా మారిన పిచ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్‌.. భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అలా వరుసగా వికెట్లు పడగొడుతూ భారత్‌కు కళ్లెం వేశాడు. అంతే కాకుండా ఫీల్డింగ్​లోనూ ఓ మెరుపు క్యాచ్‌ కూడా అందుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో ఫ్యాన్స్​ ఈ ప్లేయర్​ గురించి నెట్టింట తెగ వెతికేశారు.

లంక జట్టుకు చెందిన దునిత్‌ గత ఏడాది అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. నిరుడు టీ20 ప్రపంచకప్‌లోనూ తన సత్తా చాటిన వెల్లలాగె.. ఆ పేరు మార్మోగింది. ఆ టోర్నీలో అత్యధిక వికెట్ల (17) వీరుడు అతనే. అంతే కాక 6 మ్యాచ్‌ల్లో 246 పరుగులతో బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో అతడికి శ్రీలంక టెస్టు జట్టులో చోటు దక్కింది. తర్వాత వన్డే జట్టులోకీ వచ్చేశాడు. నిలకడగా రాణిస్తూ ప్రపంచకప్‌ ముంగిట కీలక ఆటగాళ్లలో ఒకడిగా మారాడు. టీమ్‌ఇండియాపై సంచలన ప్రదర్శనతో ఇప్పుడు అందరి దృష్టి అతడిపై పడింది. ప్రపంచకప్‌ జరగనున్నది భారత్‌లో కావడం వల్ల ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ టోర్నీపై తనదైన ముద్ర వేయడం ఖాయమనిపిస్తోంది.

Asia Cup 2023 IND VS SL : ఆసియా కప్‌ 2023 సూపర్​ ఫోర్ మ్యాచ్​లో భాగంగా టీమ్​ఇండియా-భారత్ తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో లంక స్పిన్నర్​ దునిత్​ వెల్లలాగే హైలైట్​గా నిలిచాడు. అటు బౌలింగ్​లో ఇటు బ్యాటింగ్​లో అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు ఓటమి తప్పలేదు. 41.3 ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్​ 41 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా సూపర్ ఫోర్ మ్యాచ్​ లో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుని ఫైనల్ కు అర్హత సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, రవీంద్ర జడేజా 2, బుమ్రా 2, సిరాజ్​, హార్దిక్​ తలో వికెట్​ తీశారు.

Asia Cup 2023 IND VS SL : భారత్​ విజయం.. ఫైనల్​కు అర్హత.. కానీ మ్యాచ్ హీరో మాత్రం ఆ లంక స్పిన్నరే

Asia Cup 2023 IND VS SL : లంక స్పిన్ దెబ్బకు టీమ్​ఇండియా విలవిల .. లక్ష్యం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.