ETV Bharat / sports

కరోనా సూచనలతో సెహ్వాగ్​ ఆసక్తికర ట్వీట్స్

author img

By

Published : Mar 23, 2020, 6:21 AM IST

కరోనా వారియర్స్​కు టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ధన్యవాదాలు చెప్పాడు. ఆదివారం జరిగిన 'జనతా కర్ఫ్యూ'లో యావత్‌ భారత్‌ పాల్గొనడాన్ని ప్రశంసించాడు. కరోనా నేపథ్యంలో అతడు పెట్టిన పలు ట్వీట్లపై ఓలుక్కేద్దాం.

Virender Sehwag Salute to All the Warriors who are Working Against Corona tirelessly
కరోనా సూచనలతో సెహ్వాగ్​ ఆసక్తికర ట్వీట్లు

వీరేంద్ర సెహ్వాగ్‌.. కోట్లాది మంది భారతీయులకు అభిమాన క్రికెటర్‌. ఈ మాజీ ఆటగాడు బ్యాట్‌ ఝుళిపిస్తే మంత్రముగ్దులవని వారు ఉండరేమో! అతడు బ్యాట్‌ పడితే బంతి బౌండరీ దాటాల్సిందే‌. క్రీజులో ఉంటే బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే. బౌలర్ ఎవరైనా స్కోరు బోర్డు పరుగులు పెట్టాల్సిందే. మైదానంలో బ్యాటింగ్‌ చేసినా.. ట్విటర్‌లో పంచ్‌లు విసిరినా అది వీరేంద్రుడికే చెల్లింది. ఓ బ్యాట్స్‌మన్‌గా ఎంత దూకుడుగా ఉంటాడో, ఒక నెటిజన్‌గా అంతే చురుగ్గా ఉంటాడు. తన బ్యాట్‌తో బౌండరీ బాదినంత తేలిగ్గా ట్విట్టర్​లో పంచులు విసురుతుంటాడు. కరోనాపై ఈ క్రికెటర్ ​సందేశాత్మకంగా, ఛలోక్తులతో ట్వీట్లు చేశాడు వాటిపై లుక్కేద్దాం..

అందరి నుంచి అభినందనలే

కరోనా వ్యాప్తిని నిర్మూలించడం కోసం పనిచేస్తున్న హీరోలకు.. టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ధన్యవాదాలు చెప్పాడు. "అవిరామంగా పనిచేస్తున్న యోధులందరికీ పెద్ద వందనం. భవిష్యత్తులో పరిస్థితులు సర్దుకుంటాయని ఆశిస్తున్నా. ఓం శాంతి" అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత రియల్​ హీరోలకు కృతజ్ఞతగా చప్పట్లు కొట్టే కార్యక్రమంలో భాగంగా చిన్నపాటి వీడియో షేర్​ చేయగా... అది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. చెత్త ఏరుకునే చదువులేని ఓ వ్యక్తి, కరోనాపై పోరాటం చేస్తున్నవారిని అభినందిస్తున్నట్లు పరోక్షంగా చెప్పాడు.

  • A big Salute to all the warriors who are working tirelessly .
    May this pass soon and may there be peace, peace and peace.
    Om Shanti Shantih

    — Virender Sehwag (@virendersehwag) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దూరంగా ఉండాల్సిందే

సామాజిక దూరం పాటించాలని చెబుతూ ఓ ట్రక్​ వెనుక రాసున్న కీప్​ డిస్టన్స్​ పేరును, అంతేకాకుండా ఎంతదూరం పాటించాలో చెప్తూ ఓ అమ్మాయి వీడియోను పోస్టు చేశాడు. సందర్భానుసారంగా సెహ్వాగ్​ పెట్టే ట్వీట్లు అభిమానులను ఆకర్షిస్తాయి. కరోనా వ్యాప్తి తగ్గాలంటే కాస్త దూరంగా ఉండాలంటూ చెప్పే ఓ పాతకాలం నాటి పాటనూ షేర్​ చేశాడు.

మీరు చేసే గొప్ప సేవ ఇదే

కరోనా పాజిటివ్​ ఉన్నవాళ్లు, జ్వరం, దగ్గు వంటి సూచనలు కనిపించేవాళ్లు జనసంచారానికి దూరంగా ఉండాలని సెహ్వాగ్ కోరాడు. ఇదే మీరు చేసే గొప్ప సేవ అదే అంటూ సందేశాత్మకంగా పోస్టు పెట్టాడు. త్వరలో అంతా చక్కబడుతుందని ప్రజల్లో ధైర్యాన్ని నింపాడు. అందరూ ఇళ్లలో ఉంటే వైరస్​ త్వరగా పారిపోతుందంటూ ట్వీట్లు చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నాడు.

  • I humbly request anyone who has symptoms or has been tested positive to please not put anyone else at risk. This will be a great Seva. Please be responsible, and with everyone's sensitivity and support this too shall pass smoothly soon. #CoronavirusOutbreak pic.twitter.com/NQhrvnuPCm

    — Virender Sehwag (@virendersehwag) March 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.