ETV Bharat / sports

బీసీసీఐకి కిట్​ స్పాన్సర్​ దొరికేసింది

author img

By

Published : Nov 2, 2020, 12:20 PM IST

Updated : Nov 2, 2020, 12:25 PM IST

టీమ్​ఇండియా కిట్ల స్పాన్సర్​ కోసం ఎమ్​పీఎల్​ సంస్థతో మూడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది బీసీసీఐ. దీని ద్వారా ఒక్కో మ్యాచ్​కు రూ.65 లక్షలు ఆర్జించనుంది.

BCCI
కిట్​ స్పాన్సర్​షిప్​

టీమ్​ఇండియా కిట్​ స్పాన్సర్​షిప్​ హక్కులను ఎమ్​పీఎల్ దక్కించుకుంది. ఈ సంస్థతో ఈ ఏడాది నవంబరు నుంచి 2023 డిసెంబరు(మూడేళ్లు) వరకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది బీసీసీఐ. దీని ద్వారా ఈ మూడేళ్ల కాలంలో జరిగే ఒక్కో మ్యాచ్​కు రూ.65లక్షలు ఆర్జించనుంది. ఈ విషయాన్ని బోర్డుకు చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు.

అంతకముందు టీమ్​ ఇండియా కిట్​ స్పాన్సర్​ ఉన్న నైకీ సంస్థ.. కొన్ని అనివార్య కారణాలు తప్పుకుంది. అనంతరం కొత్త బిడ్లను ఆహ్వానించింది బోర్డు.

ఆస్ట్రేలియా పర్యటన

కరోనా తర్వాత టీమ్​ఇండియా త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా నవంబరు 27 నుంచి జనవరి 19 మధ్య తలో మూడు వన్డేలు, టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.

ఇదీ చూడండి:

భారత్​తో సిరీస్​ల కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

భారత్​-ఆస్ట్రేలియా సిరీస్​లకు వేదికలు ఖరారు

Last Updated : Nov 2, 2020, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.