ETV Bharat / sitara

200 మంది డాన్సర్లకు వరుణ్​ ఆర్థిక సహాయం

లాక్​డౌన్​ ఇబ్బంది పడుతున్న పలువురు డ్యాన్సర్లకు ఆర్థిక సాయం చేశాడు హీరో వరుణ్ ధావన్. ఈ సందర్భంగా వారి బ్యాంకు ఖాతాల్లో కొంత మొత్తాన్ని జమచేశాడు. దీనిపై స్పందించిన డాన్సర్లు అతడికి ధన్యవాదాలు తెలిపారు.

Varun Dhawan extends monetary help to 200 Bollywood dancers
వరుణ్​ ధావన్
author img

By

Published : Jul 10, 2020, 7:48 PM IST

లాక్​డౌన్​తో​ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న బాలీవుడ్​ డాన్సర్లకు అండగా నిలిచాడు హీరో వరుణ్​ ధావన్​. 200 మంది నృత్య కళాకారులకు కష్టాల నుంచి ఊరట పొందేందుకు వారి బ్యాంకు ఖాతాల్లో కొంత నగదును జమ చేశాడు. బాలీవుడ్​ సినిమాల్లో గతంలో డాన్సర్​గా పనిచేసిన రాజ్​ సురానీ ఈ విషయాన్ని వెల్లడించారు.

"ఆర్థిక అవసరాలు ఉన్న డాన్సర్లును హీరో వరుణ్​ ధావన్ ఆదుకున్నాడు. అతను హీరోగా డాన్సర్​ పాత్రల్లో మూడు​ సినిమాలు నటించాడు. ఆ చిత్రాల్లోని నృత్యకళాకారులందరికీ సాయం చేశాడు​. జీవనోపాధి లేకుండా వారు ఎలా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి సమస్యలు పరిష్కరిస్తానని గతంలో వాగ్దానం చేయగా.. తాజాగా దాన్ని నెరవేర్చుకున్నాడు" అని రాజ్​ సురానీ తెలిపారు.

సాయానికి ధన్యవాదాలు

డాన్సర్లకు ఆర్థిక సాయం చేసిన వారిలో ఇప్పటికే సిద్ధార్థ్​ మల్హోత్రా, షాహిద్​ కపూర్​లూ ఉన్నారు. కొందరు నృత్యకళాకారులు ఇంటి అద్దె చెల్లించడం సహా వారి కుటుంబసభ్యులకు కావాల్సిన మెడిసిన్​ను కొనడంలోనూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజ్​ సురానీ వెల్లడించారు. అలాంటి డాన్సర్లకు సహాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

హీరో వరుణ్​ ధావన్​ నటించిన 'కూలీ నెం.1' విడుదల కావాల్సిఉంది. ఇందులో వరుణ్ సరసన సారా అలీఖాన్​ హీరోయిన్​గా నటించింది. తొలుత మే 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. లాక్​డౌన్​ కారణంగా అదికాస్త వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.