కరోనా కారణంగా పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటం వల్ల ప్రతివారం నాలుగైదు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వారం కొన్ని ఆసక్తికర సినిమాలు(telugu movies) విడుదలవుతున్నాయి. అవేంటో చూసేయండి.
సామాన్యుడి పోరాటం ఎవరిపై?
తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్ (vishal). ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ విడుదలవుతుంది. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన చిత్రం 'సామాన్యుడు'. డింపుల్ హయాతీ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'నేనొక సామాన్యుడిని ఎదురు తిరగకపోతే నన్నూ చంపేస్తారు' అంటూ విశాల్ పలికిన సంభాషణలతో కూడిన ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. మరి ఈ సామాన్యుడు ఎవరిపై పోరాటం చేయాల్సి వచ్చింది? అందుకు కారణాలేంటి? విశాల్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
మమ్ముట్టి స్కూల్ డేస్‌లో ఏం జరిగింది..?
దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని నటుడు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి. ఆయన నటిస్తున్న చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ 18' (Gangs Of 18). శంకర్ రామకృష్ణన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆర్య, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. రెండు పాఠశాలలు.. అందులో ఒకటి ప్రభుత్వ పాఠశాల, మరొకటి ప్రైవేటుది. ఆ స్కూళ్లలో అండర్ వరల్డ్ గ్రూపులుగా మారిన విద్యార్థులు. ఆ గ్రూపుల మధ్య జరిగే గొడవలు, మరోవైపు ప్రేమకథ.. ఈ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఆ రెండు పాఠశాలల విద్యార్థులతో హీరో మమ్ముట్టికి సంబంధమేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శ్రీవేంకటేశ్వర విద్యాలయ పతాకంపై వెంకట సాంబిరెడ్డి నిర్మిస్తున్నారు. ఏ.హెచ్.కాషిఫ్ సంగీతం అందించారు.
ఎట్టకేలకు వస్తున్న 'గుడ్ లక్ సఖి'
గ్లామర్ పాత్రలతో పాటు, కథాబలమున్న చిత్రాల్లోనూ నటించి మెప్పిస్తున్నారు కీర్తిసురేశ్ (keerthy suresh). ఆమె కీలక పాత్రలో క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్‌లక్ సఖి’ (Good Luck Sakhi). నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేటకు జనవరి 28న ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో మెరవనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సుధీర్‌చంద్ర పాదిరి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తుండటం విశేషం.
వీటితో పాటు, శంకర్ జాదవ్, కరిష్మా కుమార్, అదిరే అభి, సిరిరాజ్, వడ్త్యావత్ రేఖ్యానాయక్ ప్రధాన తారాగణంతో రూపుదిద్దుకున్న 'గోర్‌మాటి' అనే బంజారా చిత్రం జనవరి 26న విడుదలవుతుండగా, 'దెయ్యంతో సహజీవనం' (జనవరి 28న), 'క్షుద్రశక్తుల మంత్రగత్తెలు' (జనవరి 29) అనే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!
'ఆహా'లో అర్జున ఫల్గుణ
కాన్సెప్ట్ బేస్డ్ కథలతో తరచూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు నటుడు శ్రీవిష్ణు. 'రాజ రాజ చోర' విజయం తర్వాత ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'అర్జున ఫల్గుణ' (Arjuna Phalguna). తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్‌గా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి ‘అర్జున ఫల్గుణ’ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్రీవిష్ణుకు జోడీగా నటి అమృతా అయ్యర్ నటించారు.
డిస్నీ+ హాట్‌స్టార్
* ద ప్రామిస్ ల్యాండ్ (వెబ్ సిరీస్) జనవరి 25
* ద గిల్డెడ్ ఏజ్ (వెబ్ సిరీస్) జనవరి 25
* బ్రో డాడీ (మలయాళ చిత్రం) జనవరి 26
* తడప్ (హిందీ చిత్రం) జనవరి 28
నెట్‌ఫ్లిక్స్
* స్నోపియర్స్ (వెబ్ సిరీస్) జనవరి 25
* ది సిన్నర్ (సిరీస్ సీజన్-4) జనవరి 26
* ఫ్రేమ్డ్ (వెబ్‌సిరీస్) జనవరి 27
* ఫెరియా (హాలీవుడ్ మూవీ) జనవరి 28
* ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ (కొరియన్ సిరీస్) జనవరి 28
* గెట్టింగ్ క్యూరియస్ విత్ జొనాథన్ వాన్‌నెస్ (వెబ్ సిరీస్) జనవరి 28
* హోమ్ టౌన్ (హాలీవుడ్) జనవరి 28
జీ5
* ఆహా (మలయాళ చిత్రం) జనవరి 26
* పవిత్ర రిష్తా (హిందీ సిరీస్) జనవరి 28
ఊట్
* బడవ రాస్కెల్ (కన్నడ) జనవరి 26
ఈ రోస్ నౌ
* బరున్ రాయ్ అండ్ ది క్లిఫ్ (హాలీవుడ్) జనవరి 28
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: