ETV Bharat / sitara

Liger Promise: మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

author img

By

Published : Sep 6, 2021, 4:46 PM IST

'లైగర్' హీరో విజయ్ దేవరకొండ.. ఓ సింగర్​కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాగే ఇంటికి పిలిచి మరీ మాట్లాడారు. ఇంతకీ ఎవరా గాయని?

vijay devarakonda shanmukha priya
విజయ్ దేవరకొండ షణ్ముఖప్రియ

రౌడీహీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda) చెప్పినట్లే చేశారు. యువ గాయని​ షణ్ముఖ ప్రియకు(shanmukha priya) తన సినిమాలో పాడే అవకాశమిచ్చారు. పాట పాడటం కూడా పూర్తయిందని, త్వరలో వింటానని విజయ్ చెప్పారు. 'లైగర్​ ప్రామిస్'(Liger Promise) పేరుతో సోమవారం ఓ వీడియో విడుదల చేశారు.

ఇటీవల జరిగిన 'ఇండియన్ ఐడల్ 12'(indian idol season 12) ఫైనల్​ కంటెస్టెంట్​ల్లో ఒకరైన షణ్ముఖ ప్రియను విజయ్ దేవరకొండ సపోర్ట్ చేశారు. ఆమెను గెలిపించాలంటూ అభిమానుల్ని కోరారు. అలానే హైదరాబాద్​ రాగానే తనను కలుస్తానని, తన కొత్త సినిమాలో పాట పాడే ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారు.

vijay devarakonda liger movie
షణ్ముఖ ప్రియ, ఆమె తల్లితో విజయ్ దేవరకొండ

హైదరాబాద్​లోని తన ఇంట్లో షణ్ముఖను కలిసిన విజయ్.. చాలాసేపు మాట్లాడారు. ఈ యువ గాయనిని సత్కరించిన విజయ్ దేవరకొండ తల్లి.. ఆమెకు చీరను బహుకరించారు.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న 'లైగర్​'(liger release date).. ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సింది. కానీ కరోనా వల్ల షూటింగ్​ ఆలస్యమైంది. దీంతో రిలీజ్​ కూడా లేట్ అయింది. అనన్యా పాండే హీరోయిన్​. పూరీ జగన్నాథ్(puri jagannath).. ఈ పాన్ ఇండియా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్​జోహార్​, ఛార్మీ, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.